Samsung Galaxy Z Fold 8 Series లాంచ్ కోసం రంగం సిద్ధం: అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లైవ్ ఇలా చూడండి.!
Samsung Galaxy Z Fold 8 Series లాంచ్ కోసం శాంసంగ్ రంగం సిద్ధం
ఈవెంట్ నుంచి Watch 9 కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు లీక్స్
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు
Samsung Galaxy Z Fold 8 Series లాంచ్ కోసం శాంసంగ్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శాంసంగ్ నిర్వహించనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ సిరీస్ ను లాంచ్ లాంచ్ చేసే అవకాశం ఉంది. కేవలం ఫోల్డ్ ఫోన్ మాత్రమే కాదు ఈ ఈవెంట్ నుంచి Watch 9 కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి.
Surveyఅన్‌ప్యాక్డ్ ఈవెంట్ లైవ్ లో ఎలా చూడాలి?
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం, ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు (6:30 PM IST) ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ ను Samsung.com, శాంసంగ్ న్యూస్ రూమ్ మరియు శాంసంగ్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ప్రసారం చేస్తుంది. కాబట్టి, ఈ మాధ్యమాల ద్వారా శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ను మీరు నేరుగా చూడవచ్చు.
Samsung Galaxy Z Fold 8 Series : అంచనా ఫీచర్స్
ఈ సిరీస్ నుంచి మొత్తం రెండు ఫోల్డ్ ఫోన్స్ మరియు ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు లీక్స్ మరియు కొన్ని రిపోర్ట్ లు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ సిరీస్ ఫోన్స్ కలిగి ఉండవచ్చని తెలిపే అంచనా ఫీచర్స్ కూడా వెల్లడిస్తున్నారు.
లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్ నుంచి ప్రీమియం ఫోన్ గా 8 ఫోల్డ్ అల్ట్రా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఫోన్ 8 ఇంచ్ మెయిన్ స్క్రీన్ మరియు 6.5 ఇంచ్ కవర్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. గత ఫోన్స్ మాదిరిగా ఇందులో కూడా 200MP మెయిన్ కెమెరా కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు.
ఇదే సిరీస్ నుంచి గెలాక్సీ Z ఫోల్డ్ కూడా లాంచ్ అవుతుందని చెబున్నారు. ఈ ఫోన్ లో 7.6 మెయిన్ స్క్రీన్ మరియు 5.4 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంటుందని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా లీక్స్ చెబుతున్నాయి.
Also Read: Talliki Vandanam: ఆధార్ నెంబర్ తో డబ్బులు వచ్చేది లేనిది ఆన్‌లైన్ లో చెక్ చేసుకోండి.!
ఇక స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే, ఈ ఈవెంట్ నుంచి గెలాక్సీ వాచ్ 9 స్మార్ట్ వాచ్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని ఊహించి చెబుతున్నారు. ఈ వాచ్ 40mm మరియు 44mm సైజుల్లో వచ్చే అవకాశం ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఈరోజు వరకు వచ్చిన అన్ని లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ కి ఈరోజు తెరపడుతుంది. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఈవెంట్ నుండి ఎటువంటి డివైజెస్ లాంచ్ చేస్తుంది మరియు వాటి ఫీచర్స్ కూడా తేటతెల్లమవుతాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile