Samsung Galaxy Z Fold 7: జబర్దస్త్ ఫీచర్స్ మరియు స్లిమ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోల్డ్ సిరీస్ నుంచి ఈరోజు జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ ను విడుదల చేసింది

Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది

స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా మరియు గొప్ప స్లీక్ డిజైన్ తో కూడా వచ్చింది

Samsung Galaxy Z Fold 7: శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోల్డ్ సిరీస్ నుంచి ఈరోజు జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా మరియు గొప్ప స్లీక్ డిజైన్ తో కూడా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమిటో తెలుసుకుందామా.

Samsung Galaxy Z Fold 7 : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ ను మధ్యకు మడతపెట్టే 8 ఇంచ్ స్క్రీన్ మరియు 6.5 ఇంచ్ అవుటర్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్క్రీన్లు కూడా Dynamic AMOLED 2X తో అందించింది. వీటిలో మడతపెట్టే మెయిన్ స్క్రీన్ QXGA+ రిజల్యూషన్ మరియు అవుటర్ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ రెండు స్క్రీన్లు కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటాయి.

ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 8.2mm మందంతో, మడత విప్పినప్పుడు కేవలం 4.2mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ కవర్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ ను ఫ్రేమ్ ను అడ్వాన్స్డ్ ఆర్మ అల్యూమినియం ఫ్రేమ్ తో అందించింది.

గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 16 జీబీ ర్యామ్ మరియు 1TB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ OneUI 8 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.

ఈ ఫోన్ లో జబర్దస్త్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో, 200MP వైడ్ యాంగిల్ కెమెరా, 10MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కలిగిన రియర్ కెమెరా మరియు 10MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ ఫోన్ 30x స్పేస్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్ మరియు AI సూపర్ రిజల్యూషన్ తో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 4,400mAh డ్యూయల్ బ్యాటరీతో అందించింది మరియు ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ తో కూడా అందించింది.

Also Read: ఈరోజు చవక ధరలో కొత్త QLED స్పెషల్ ఎడిషన్ Smart TV లను లాంచ్ చేసిన Kodak

ఈ ఫోన్ ను శామ్సంగ్ మూడు వేరియంట్స్ లో అందించింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

Samsung Galaxy Z Fold 7 : ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 1,74,999

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (12 జీబీ + 512 జీబీ) ధర : రూ. 1,86,999

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (16 జీబీ + 1 టీబీ) ధర : రూ. 2,10,999

ఈ ఫోన్ ను బ్లాక్ షాడో, సిల్వర్ షాడో మరియు జెట్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ప్రీ- ఆర్డర్ లకు అందుబాటులోకి వచ్చింది. జూలై 12వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుందని శామ్సంగ్ తెలిపింది. అయితే, ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్ లో భాగంగా గొప్ప డీల్ అందించింది.

డీల్ ఏమిటంటే, ఈరోజు నుంచి 12వ తేదీ లోపు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసే వారికి కేవలం బేసిక్ వేరియంట్ దగరకే 12 జీబీ + 512 జీబీ వేరియంట్ అందుకోవచ్చని శామ్సంగ్ ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :