శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G పైన 12వేల భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్. ఈ డిస్కౌంట్ తో ఈ శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. తద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కవ ధరకే లభిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S21 FE 5G: ధర & ఆఫర్లు
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.49,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం అమెజాన్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.37,999 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ ఫోన్ ను Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 2100 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,12MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP (OIS) టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile