Samsung Galaxy M56 5G: అతి సన్నని డిజైన్ మరియు ట్రిపుల్ AI కెమెరాతో వస్తోంది.!
శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది
Samsung Galaxy M56 5G ఫోన్ ను వచ్చే వారంలో విడుదల చేస్తుంది
ఈ అప్ కమింగ్ ఫోన్ ను అతి సన్నని డిజైన్ మరియు ట్రిపుల్ AI కెమెరాతో తీసుకు వస్తోంది
Samsung Galaxy M56 5G: శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. అదే, శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను వచ్చే వారంలో విడుదల చేస్తుంది. శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని డిజైన్ మరియు ట్రిపుల్ AI కెమెరాతో తీసుకు వస్తోంది.
SurveySamsung Galaxy M56 5G: లాంచ్
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 17వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఆప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజి నుండి ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Samsung Galaxy M56 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ ను గెలాక్సీ సిరీస్ లో ఎన్నడూ చూడని స్లీక్ డిజైన్ తో తీసుకువస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.2mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు కేవలం 180 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని శామ్సంగ్ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ముందుగా వచ్చిన ఫోన్స్ కంటే 30% సన్నగా ఉంటుందని కూడా చెబుతోంది.

ఈ ఫోన్ లో అడ్వాన్డ్ మాన్స్టర్ కెమెరా ఉందట. ఇందులో, వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరాలు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా బంప్ ను కూడా చూడముచ్చటగా అందించింది. గెలాక్సీ ఎం56 5జి స్మార్ట్ ఫోన్ లో ముందు 10-bit HDR వీడియో సపోర్ట్ కలిగిన 12MP ఫ్లాగ్ షిప్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఆబ్జెక్ట్ ఎరేజర్ మరియు ఇమేజ్ క్లిప్పర్ వంటి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 30,000 ఈరోజు లభిస్తున్న బెస్ట్ 1.5 Ton Split AC డీల్.!
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద Super AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా విక్టస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా శామ్సంగ్ వెల్లడించే అవకాశం ఉండవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile