Samsung Galaxy M56 5G సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
Samsung Galaxy M56 5G లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా వచ్చింది
మంచి కెమెరాతో కూడా ఉంటుందని శామ్సంగ్ తెలిపింది
Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా లాంచ్ అయ్యింది. అంటే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఇతర ఫోన్ లతో పోలిస్తే, ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. కేవలం సన్నగా ఉండటం మాత్రమే కాదు ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు మంచి కెమెరాతో కూడా ఉంటుందని శామ్సంగ్ తెలిపింది.
SurveySamsung Galaxy M56 5G : ఫీచర్స్
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 6.73 ఇంచ్ Super AMOLED ప్లస్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. శామ్సంగ్ ఈ ఫోన్ లేటెస్ట్ సొంత చిప్ సెట్ Exynos 1480 తో లాంచ్ చేసింది. దీనికి జతగా 8GB LPDDR5X ర్యామ్ మరియు256GB (UFS 3.1) బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో Android 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల మేజర్ అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే కెమెరా సిస్టం కూడా వుంది. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియుముందు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K Video సపోర్ట్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ మరియు ఎడిట్ సజెషన్ వంటి చాలా AI ఫీచర్స్ కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 56 5జి స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Realme 14T 5G: సెగ్మెంట్ సూపర్ స్క్రీన్ మరియు 6000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
Samsung Galaxy M56 5G : ధర
శామ్సంగ్ ఈ ఫోన్ ను రూ. 27,999 ధరతో లాంచ్ చేసింది. ఇది 8GB + 128GB బేసిక్ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు samsuna.com నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లైట్ గ్రీన్ మరియు బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఆఫర్స్
ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ఆఫర్ ను అందించింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile