Samsung Galaxy M47 5G: అదరగొట్టే ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Samsung Galaxy M47 5G లాంచ్ కోసం చాలా రోజులుగా టీజింగ్ చేసిన శాంసంగ్

చెప్పిన దానికంటే ముందుగా ఈ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసింది

లాంగ్ బ్యాటరీ మరియు మంచి పర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ తో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది

Samsung Galaxy M47 5G: అదరగొట్టే ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy M47 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజులుగా టీజింగ్ చేసిన శాంసంగ్, ఈ ఫోన్ ను చెప్పిన దానికంటే ముందుగా ఈ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసింది. అదరగొట్టే ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్, లాంగ్ బ్యాటరీ మరియు మంచి పర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ తో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. సరికొత్తగా విడుదలైన ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M47 5G: ప్రైస్

శాంసంగ్ ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. జూలై 4 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. అంటే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. కాబట్టి, ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకునే అవకాశం అమెజాన్ అందిస్తుంది. ఈ ఫోన్ ను రోగ్ రెడ్ మరియు బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రిలీజ్ చేసింది.

Samsung Galaxy M47 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జి ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ స్క్రీన్, 4x స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగిన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. 2 మీటర్ డ్రాప్ ను కూడా తట్టుకునేలా ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్లు శాంసంగ్ పేర్కొంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా ఛాయా స్లీక్ గా మరియు ఆకట్టుకునేలా ఉంటుంది.

Samsung Galaxy M47 5G price and features

పెర్ఫార్మన్స్ పరంగా, ఈ ఫోన్ Snapdragon 6 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో జతగా LPDDR5X ర్యామ్ మరియు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ ను కూడా చక్కగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉన్నా కూడా 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (OIS) ప్రధాన కెమెరా జతగా 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పాటు 2MP మ్యాక్రో సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. 12MP HDR సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ ముందు భాగంలో ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంది.

Also Read: ప్రైమ్ డే బిగ్ డీల్ గా Samsung Galaxy S25 Ultra ఫోన్ ని ప్రకటించిన అమెజాన్.!

ఈ ఫోన్ లేటెస్ట్ One UI సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile