Samsung Galaxy M47 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను ఈరోజు అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది

రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మెరిసిపోతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో ఉంటుంది

Samsung Galaxy M47 5G: శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. అంతేకాదు, అమెజాన్ ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజి అందించి మరీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ గురించి టీజింగ్ చేస్తోంది.

Samsung Galaxy M47 5G: లాంచ్

శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కచ్చితమైన లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ జూలై ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, అమెజాన్ ప్రకటించిన బిగ్ సేల్ ప్రైమ్ డే 2026 సేల్ నెల ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి, ఈ సేల్ కంటే ముందుగా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, శాంసంగ్ నుంచి అఫీషియల్ లాంచ్ అనౌన్స్ వచ్చే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది.

Samsung Galaxy M47 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం 47 ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ వెల్లడయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మెరిసిపోతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా చేతిలో పట్టుకువడానికి అవసరమైన మంచి గ్రిప్ డిజైన్ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుందని శాంసంగ్ తెలిపింది.

ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ టీజర్ ఈమె లో రివీల్ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP నో షేక్ మెయిన్ కెమెరా ఉండొచ్చని కూడా ఊహించి చెబుతున్నారు. ఈ ఫోన్ కొత్త ఎం 4x సిరీస్ ఫోన్ లలో మరింత వేగవంతమైన చిప్ సెట్, బిగ్ బ్యాటరీ అండ్ పవర్ ఫుల్ ఛార్జ్ సపోర్ట్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉంటాయని శాంసంగ్ చెబుతోంది.

Also Read: Oppo Reno 16 Series: కొత్త స్మార్ట్ ఫోన్ మరియు బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!

శాంసంగ్ గెలాక్సీ ఎం అంటేనే బడ్జెట్ యూజర్ ప్రత్యేకమైన సిరీస్ మరియు ఈ సిరీస్ నుని ఇప్పటి వరకు బడ్జెట్ యూజర్ కోసం అనేక ఫోన్లు శాంసంగ్ అందించింది. ఇప్పుడు కూడా మరింత ఆకట్టుకునే ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని ఆశాభావం వక్తం చేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :