Oppo Reno 16 Series: కొత్త స్మార్ట్ ఫోన్ మరియు బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది
Oppo Reno 16 Series లాంచ్ కోసం ఒప్పో కొత్త టీజర్ విడుదల చేసింది
ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి గొప్పగా చెబుతోంది
Oppo Reno 16 Series: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే, ఒప్పో రెనో 16 సిరీస్. ఈ సిరీస్ నుండి కొత్త ఫోన్ తో పాటు కొత్త ఇయర్ బడ్స్ మరియు ఇతర డివైజెస్ విడుదల చేయనున్నట్లు ఒప్పో వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ చేసిన ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి గొప్పగా చెబుతోంది.
SurveyOppo Reno 16 Series: లాంచ్ డేట్
ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ కోసం ఒప్పో కొత్త టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ నుంచి మూడు డివైజెస్ లాంచ్ చేయనున్నట్లు ఇమేజ్ లో రివీల్ చేసింది. ఇందులో ఒప్పో రెనో 16 సిరీస్ ఫోన్, ఇయర్ బడ్స్ మరియు మరో డివైజ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా ప్రత్యేకమైన టీజర్ పేజి కూడా అందించింది.

Oppo Reno 16 Series: ఫీచర్స్
ఒప్పో రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ అప్ కమింగ్ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ గురించి ఎక్కువ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ కమింగ్ సిరీస్ లీక్డ్ మరియు రూమర్ ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి.
Also Read: Nothing (b) Series: కొత్త ఫోన్ కోసం సరికొత్తగా టీజింగ్ చేసిన నథింగ్.!
ఒప్పో రెనో 16 సిరీస్ : లీక్డ్ ఫీచర్స్
ఈ అప్ కమింగ్ ఒప్పో సిరీస్ కు సంబంధించిన పలు వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ లీక్స్ ప్రకారం, ఈ అప్ కమింగ్ ఫోన్ 6.32 అంగుళాల కాంపాక్ట్ AMOLED డిస్‌ప్లే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు అని కూడా లీకులు సూచిస్తున్నాయి.
ఈ సిరీస్ లో ప్రో వేరియంట్ ఉంటుంది మరియు ఈ వేరియంట్ పెద్ద 6.78-అంగుళాల AMOLED స్క్రీన్ ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
