Samsung Galaxy M16 5G: మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన లేటెస్ట్ ఫోన్ సేల్.!
Samsung Galaxy M16 5G ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో అందుకోవచ్చు
ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, ఫీచర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో శామ్సంగ్ అందించింది
Samsung Galaxy M16 5G స్మార్ట్ టీవీ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ మార్కెట్ లో శామ్సంగ్ బడ్జెట్ ధరలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో అందుకోవచ్చు. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, ఫీచర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో శామ్సంగ్ అందించింది.
Samsung Galaxy M16 5G : ప్రైస్
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ముడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
4GB + 128GB వేరియంట్ ధర : రూ. 12,499
6GB + 128GB వేరియంట్ ధర : రూ. 13,999
8GB + 128GB వేరియంట్ ధర : రూ. 15,499
ఆఫర్స్:
ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు మంచి బ్యాంక్ అందించింది. ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.
Samsung Galaxy M16 5G : ఫీచర్స్
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOELD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.9 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. శామ్సంగ్ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను కూడా జతచేసింది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6 జెనరేషన్ OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ బ్లష్ పింక్, మింట్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.