శామ్సంగ్ తన గెలాక్సీ M 11 స్మార్ట్ ఫోన్ను భారీ స్పెక్స్ తో విడుదల చేసింది

శామ్సంగ్ తన గెలాక్సీ M 11 స్మార్ట్ ఫోన్ను భారీ స్పెక్స్ తో విడుదల చేసింది
HIGHLIGHTS

శామ్సంగ్ ఇటీవల 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ M 21 ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ M 11 ను కూడా ప్రవేశపెట్టింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ యొక్క UAE వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకలలో  6.4-అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్రధానముగా చెప్పుకోవచ్చు.

ఈ శామ్సంగ్ గెలాక్సీ M 11 ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు కాని స్మార్ట్‌ ఫోన్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయించబడుతుందని తెలియ చేయబడింది. ఈ హ్యాండ్‌ సెట్ ఇతర మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. ఈ కొత్త బడ్జెట్ ఫోన్ బ్లూ, వైలెట్ మరియు బ్లాక్ వంటి మూడు రంగులలో వచ్చింది.

శామ్సంగ్ గెలాక్సీ M 11 ఒక 6.4-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు HD + రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లేలో పంచ్-హోల్ డిజైన్ ఇవ్వబడింది, ఇది ఈ రోజుల్లో ట్రెండ్ గా నడుస్తోంది. ఈ పంచ్ హోల్ ఫోన్, సెల్ఫీ కెమెరాను ఎడమ అంచున కలిగిఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది, ఇది ఫిక్స్‌డ్ ఫోకస్‌తో వస్తుంది మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.0 గా ఉంటుంది.

ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రాధమిక కెమెరా 13 మెగాపిక్సెల్స్ మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 1.8, రెండవ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.2 మరియు మూడవ డెప్త్ సెన్సార్ పోర్ట్రెయిట్ షాట్స్ తీయడం కోసం ఇవ్వబడింది. ఈ ఫోన్ 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు. ఇందులో అందించిన శామ్సంగ్ చిప్‌సెట్ గురించి ఇంకా ప్రస్తావించలేదు కాని గెలాక్సీ M 11 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం 11 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ లో ఇవ్వనుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా కూడా దీని స్టోరేజిని పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది మరియు  USB-C పోర్టును కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోనులో బ్లూటూత్ 4.2, 2.4 గిగాహెర్ట్జ్ వై-ఫై బి / జి / ఎన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo