Samsung Galaxy F70 Pro 5G launched with new features and special launch offers
Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు లాంచ్ స్పెషల్ ఆఫర్ తో శాంసంగ్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ సరికొత్త స్లీక్ డిజైన్ మరియు మరియు కొత్త కలర్స్ లో కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. మరి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ లాంచ్ స్పెషల్ ఆఫర్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
ఈ స్మార్ట్ ఫోన్ ఆరా గ్రీన్ మరియు ఆల్ఫా బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై బెస్ట్ బ్యాంక్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,200 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.
ఈ కొత్త ఫోన్ లో 6.7 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్ మరియు గొప్ప బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో అందించింది. అలాగే, ఇందులో LPDDR5X 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ మరియు గేమింగ్‌న వంటి పనులు సాఫీగా నిర్వహించగలదు. ఈ ఫోన్ Android 16 ఆధారిత One UI 8.5 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ దీర్ఘకాలిక సాఫ్ట్ వేర్ అప్డేట్ మరియు సెక్యూరిటీ అప్ డేట్ లను కూడా అందుకుంటుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 5MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, లేటెస్ట్ AI ఆధారిత కెమెరా ఫీచర్లు మరియు ప్రత్యేకమైన శాంసంగ్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6,000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ కూడా శాంసంగ్ Knox Security సెక్యూరిటీ ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.