రేపు ఇండియాలో విడుదల కానున్న Samsung galaxy F14 5G స్మార్ట్ ఫోన్.!

రేపు ఇండియాలో విడుదల కానున్న Samsung galaxy F14 5G స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

రేపు ఇండియాలో విడుదల కానున్న Samsung galaxy F14 5G స్మార్ట్ ఫోన్

టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క చాలా వివరాలను కూడా వెల్లడించింది

శామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ కంపెనీ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది

రేపు ఇండియాలో విడుదల కానున్న Samsung galaxy F14 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు, అనగా మార్చి 24 వ తేది మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చెయ్యడానికి శామ్సంగ్ డేట్ ఫిక్స్ చేసింది. శామ్సంగ్ ఇప్పటికే అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క చాలా వివరాలను కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఎటువంటి ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో విడుదల కాబోతోందో చూద్దామా.       

Samsung Galaxy F14 5G: టీజ్డ్ స్పెక్స్

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను టీజింగ్ ద్వారా వెల్లడించింది. Flipkart ఈ స్మార్ట్ ఫోన్ గురించి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. ఇక ఈ ఫోన్ గురించి శామ్సంగ్ వెల్లడించిన స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే రక్షణ కోసం దీన్ని గొరిల్లా గ్లాస్ 5 తో ప్యాక్ చేసినట్లు టీజింగ్ చెబుతోంది. 

శామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ కంపెనీ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అదే, Exynnos 1330 5G ప్రోసెసర్ మరియు దీనికి జతగా RAM Plus ఫీచర్ ను కూడా జత చేసినట్లు టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ 13 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుందని, 4 సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 2 OS అప్గ్రేడ్స్ ను కూడా అందుకుంటుందని కూడా శామ్సంగ్ చెబుతోంది. 

ఈ ఫోన్ ను 6,000mAh బిగ్ బ్యాటరీతో తీసుకువస్తోంది మరియు ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Android 13OS ఆధారితమైన లేటెస్ట్ One UI 5.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుందని కూడా ఈ టీజర్ ద్వారా వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo