Samsung Galaxy F06 5G launched
Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో శామ్సంగ్ విడుదల చేసింది. ‘అందరి వద్ద సొంత 5జి ఫోన్ ఉంటుంది’ అనే నినాదంతో ఈ బడ్జెట్ ఫోన్ ను శామ్సంగ్ విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాల పై ఒక లుక్కేద్దామా.
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ను ఈ ధరకు అందించింది. అయితే, ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 11,499 రూపాయల ధారకు అందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ PLS LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HD+ (1600 x 720) రిజల్యూషన్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 బడ్జెట్ 5G చిప్ సెట్ తో వస్తుంది. దీనికి జతగా 4GB / 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. శామ్సంగ్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను 5000 mAh పెద్ద బ్యాటరీతో మరియు 25W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ 4 మేజర్ OS అప్గ్రేడ్ మరియు 4 years రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ ను అందుకుంటుంది.
Also Read: Mivi Super Pods Concerto బడ్స్ ను 3D సౌండ్ స్టేజ్ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.!
ఈ శామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, క్విక్ షేర్ మరియు వాయిస్ ఫోకస్ ఆన్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.