స్నాప్ డ్రాగన్ 855, 48MP ట్రిపుల్ కెమేరాతో విడుదలైన Samsung Galaxy A90 5G స్మార్ట్ ఫోన్
ఒక 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, మంచి స్పెక్స్ 8GB ర్యామ్ తో లభిస్తుంది.
శామ్సంగ్ తన నాలుగవ 5 జి స్మార్ట్ ఫోనుగా, గెలాక్సీ ఎ 90 5G ని విడుదల చేసింది. ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎ 90 5G గత నెలలో గీక్‌బెంచ్‌లో కనిపించిన తర్వాత ఇప్పుడు అధికారికంగా ప్రవేశపెట్టబడింది. ఈ స్మార్ట్ ఫోనుకు ఒక 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, మంచి స్పెక్స్ 8GB ర్యామ్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి పాప్-అప్ కెమెరాను పొందడం లేదు, బదులుగా ముందు కెమెరాను ఇన్ఫినిటీ-యు డిస్ప్లే యొక్క నోచ్ లో ఉంచారు.
Surveyఈ శామ్సంగ్ గెలాక్సీ A 90 5 G లో 6.7-అంగుళాల FHD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-U డిస్ప్లే ఉంది మరియు ఈ డిస్ప్లే లోపల ఒక వేలిముద్ర సెన్సార్ కూడా ఉంచబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది మరియు ఇది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్ కూడా వచ్చింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టోరేజిని ఒక మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 512 GB కి పెంచవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ A90 5G గాజుతో కప్పబడిన బెక్ వద్ద ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై తో ఆధారితంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ శామ్‌సంగ్ డీఎక్స్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఈ ఫీచర్‌తో వచ్చిన A సిరీస్‌లో మొదటి ఫోన్ ఇది.
కెమెరా గురించి మాట్లాడితే, ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎ 90 5 Gలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక 48MP ప్రైమరీ కెమెరా మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.0 ఉన్నాయి, రెండవ కెమెరా 8 ఎంపి అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 123 డిగ్రీల ఫీల్డ్ ఫీల్డ్ తో వస్తుంది మూడవ కెమెరా 5MP డెప్త్ సెన్సార్ గా పనిచేస్తుంది. కెమెరా సెటప్‌లో, సూపర్ స్టెడి, సీన్ ఆప్టిమైజర్ మరియు ఫ్లో డిటెక్టర్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఫోనులో సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది, దీనిలో ఎపర్చరు ఎఫ్ / 2.0 ఉంది.
పేరు సూచించినట్లుగా, శామ్సంగ్ గెలాక్సీ ఎ 90 5G 5 జి కనెక్టివిటీతో ప్రారంభించబడింది, వినియోగదారులు 5 జి కనెక్టివిటీతో లైవ్ గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు.
మొబైల్ ఫోన్ నలుపు మరియు తెలుపు రంగులలో ప్రవేశపెట్టబడింది.ఈ ఫోన్ 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు కాని పరికరం ధర త్వరలో వెల్లడి కావచ్చు.