శామ్‌సంగ్ గెలాక్సీ A 20s ట్రిపుల్ కెమేరా పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది

HIGHLIGHTS

గెలాక్సీ A 20 లో సూపర్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు.

శామ్‌సంగ్ గెలాక్సీ A 20s ట్రిపుల్ కెమేరా పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది

శామ్‌సంగ్ యొక్క గెలాక్సీ A సిరీస్‌ నుండి ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, మరొకసారి ఇదే A సిరీస్ నుండి కంపెనీ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ను విడుదల చేసింది. ఈ దక్షిణ కొరియా సంస్థ, ముందుగా తన గెలాక్సీ A 30 s మరియు గెలాక్సీ A 50s లను విడుదల చేసింది మరియు ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ A 20s  ఫోన్ థాయ్‌లాండ్‌లో లాంచ్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ ఒక 6.4-అంగుళాల HD + ఇన్ఫినిటీ-V డిస్ప్లేను  కలిగివుంటుంది. అలాగే, ఇది 1560 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ అందిస్తుంది,  అయితే గెలాక్సీ A 20 లో సూపర్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అడ్రినో 506GPUతో తీసుకొచ్చారు.

గెలాక్సీ ఎ 20s ను రెండు వేరియంట్లలో తీసుకువచ్చారు, ఒక వేరియంట్లో 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మరొక వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజిని ఇచ్చారు. ఇక కెమెరా విభాగంలో ఈ ఫోనుకు అప్‌గ్రేడ్ కూడా ఉంది మరియు ర్ ఫోనులో ఒక ట్రిపుల్ కెమెరాను  తీసుకువచ్చారు.

ఈ ఫోన్ f / 1.8 ఎపర్చరు గల ఒక 13MP ప్రాధమిక కెమెరాను కలిగి ఉంది, ఇది LED ఫ్లాష్‌తో వస్తుంది మరియు  f / 2.2 ఎపర్చరు గల  8MP మరొక కెమెరా  మరియు 5MP డెప్త్ సెన్సార్సుతో జతగా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని ఇచ్చారు.

ఒక వేగవంతమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫోన్ వెనుక భాగంలో అందించబడుతుంది. కనెక్టివిటీ కోసం, ఈ మొబైల్ డ్యూయల్ 4 జి VoLTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ 4.2, జిపిఎస్ + గ్లోనాస్ మరియు USB  టైప్-సి పోర్ట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆండ్రాయిడ్ 9 పై OS తో లాంచ్ చేశారు మరియు ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, దీనికి 15W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇవ్వబడుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ A  20 లను బ్లాక్, బ్లూ, గ్రీన్ మరియు రెడ్ ఆప్షన్లతో సహా నాలుగు రంగులలో అందిస్తున్నారు. ఈ ఫోన్ యొక్క 4 జిబి ర్యామ్ వేరియంట్  6,490 థాయ్ బట్ (సుమారు $ 212) ధర వద్ద ప్రారంభించబడింది. ఈ  గెలాక్సీ A 20 s  ఇతర మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందా అనే విషయం, ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo