శామ్సంగ్ తన A- సిరీస్ నుండి గెలాక్సీ A10s ని విడుదల చేసింది

శామ్సంగ్ తన A- సిరీస్ నుండి గెలాక్సీ A10s ని విడుదల చేసింది
HIGHLIGHTS

ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది

శామ్సంగ్ తన A- సిరీస్‌ నుండి మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ను తీసుకువచ్చింది. అనేక పుకార్ల తరువాత, శామ్సంగ్ గెలాక్సీ ఎ 10s ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్, ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసిన గెలాక్సీ ఎ 10 ఆధారంగా ఉంది. ఈ కొత్త  గెలాక్సీ ఎ 10s  డ్యూయల్ రియర్ కెమెరా, పెద్ద బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు మరెన్నో ప్రత్యేకతల మేళవింపుగా వస్తుంది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎ 10 ఎస్, ఎ-సిరీస్‌లో సరికొత్త సభ్యుడుగా చేరింది,  ఇది 720 x 1520 పిక్సెల్స్ రిజల్యూషన్‌ గల  ఒక 6.2-అంగుళాల HD + ఇన్ఫినిటీ-వి (వి-ఆకారపు నోచ్ ) ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది, “ఇది మీడియాటెక్ హెలియో P 22 SoC కావచ్చు” అని  చెప్పారు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది గెలాక్సీ ఎ 10 లో కనిపించే 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ కంటే చాలా పెద్దది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాక, స్టోరేజి సామర్థ్యం ఒక ప్రత్యేకమైన మైక్రో SD స్లాట్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు.

 గెలాక్సీ A10s డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: ఒక f / 1.8 ఎపర్చరు 13MP ప్రాధమిక సెన్సర్ + 2MP డెప్త్ కెమెరాతో ఉంటుంది. ముందు కెమెరాను 8 MP సెన్సార్‌తో అప్‌గ్రేడ్ చేశారు. అంతేకాకుండా, గెలాక్సీ ఎ 10s లో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది, ఇది గెలాక్సీ ఎ 10 లో లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై తో వస్తుంది, అలాగే శామ్సంగ్ వన్ UI స్కిన్ తో ఉంటుంది.

రెడ్ , బ్లూ , గ్రీన్  మరియు బ్లాక్ వంటి కలర్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. అయితే, శామ్సంగ్ ఫోన్ ధర మరియు లభ్యత వివరాలను ఇంకా ధృవీకరించలేదు, అయితే ఇది త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే, మునుపటి నివేదికల ప్రకారం, ఈ గెలాక్సీ ఎ 10s  ధర 8,990 రూపాయలుగా తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo