Samsung Galaxy A03 Core: ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరకే లాంచ్

Samsung Galaxy A03 Core: ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరకే లాంచ్
HIGHLIGHTS

సాంసంగ్ తన A సిరీస్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది

Samsung Galaxy A03 Core పేరుతో విడుదల

బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది

సాంసంగ్ తన A సిరీస్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. Samsung Galaxy A03 Core పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే కొనసాగుతున్న Realme C సిరీస్, Poco M సిరీస్ మరియు Redmi 9 సిరీస్ ఫోన్లకు గట్టి పోటీగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది.

Samsung Galaxy A03 Core: ప్రైస్

ఈ లేటెస్ట్ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 2GB మరియు 32GB సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది మరియు దీని ధర కేవలం రూ.7999 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ రెండు కలర్ లలో లభిస్తుంది.    

Samsung Galaxy A03 Core: స్పెక్స్

సాంసంగ్ గెలాక్సీ ఎ03 కోర్  స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 – అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే మరియు ముందు భాగంలో V కటౌట్ నోచ్ ఉన్నాయి.  ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది మరియు 211 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ గ్రే రెండు రంగుల్లో లభిస్తుంది.

గెలాక్సీ ఎ03 కోర్ ఫోన్ Unisoc SC9863A ఆక్టా-కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టిబి వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో ఇది 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది డార్క్ మోడ్ వంటి ఫీచర్లతో ఆండ్రాయిడ్ 11 గో OS పైన నధిస్తుంది. ఈ ఫోన్ వెనుక సింగల్ 8MP కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎ03 కోర్  స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo