Price Cut: సాంసంగ్ లేటెస్ట్ ఫోన్ పైన రూ. 3,500 తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

Price Cut: సాంసంగ్ లేటెస్ట్ ఫోన్ పైన రూ. 3,500 తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!
HIGHLIGHTS

Samsung Galaxy A34 5G పైన మరొక్కసారి భారీ ప్రైస్ కట్ ను అనౌన్స్ చేసింది

లేటెస్ట్ ప్రైస్ కట్ దెబ్బకి కేవలం 25 వేల రూపాయల ఉప బడ్జెట్ లోనే లభిస్తోంది

ఈ ఫోన్ ను మరింత చవక ధరకే కొనుగోలు చేసే అవకాశం అందించింది అమేజాన్

Price Cut: సాంసంగ్ లేటెస్ట్ ఫోన్ పైన రూ. 3,500 తగ్గింపు ప్రకటించిన కంపెనీ. సాంసంగ్ మిడ్ రేంజ్ సిరీస్ అయిన A సిరీస్ నుండి గత సంవత్సరం విడుదల చేసిన Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు మరొక్కసారి భారీ ప్రైస్ కట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ 30 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యింది. అయితే, ఇప్పుడు అందుకున్న లేటెస్ట్ ప్రైస్ కట్ దెబ్బకి కేవలం 25 వేల రూపాయల ఉప బడ్జెట్ లోనే లభిస్తోంది.

Samsung Galaxy A34 5G Price Cut

సాంసంగ్ గెలాక్సీ A34 5జి స్మార్ట్ ఫోన్ ను కంపెనీ గత సంవత్సరం రూ. 30,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8 GB + 128 GB స్టోరేజ్ వేరియంట్ ను ఈ ధరతో విడుదల చేసింది. అయితే, 2023 నవంబర్ నెలలో ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల తగ్గింపును అందించింది. ఆ తరువాత, రీసెంట్ గా ఈ ఫోన్ పైన మరొక రూ. 1,000 అందించిన సాంసంగ్, ఇప్పుడు ఈ ఫోన్ పైన ఏకంగా రూ. 3,500 తగ్గింపును కూడా ప్రకటించింది.

Samsung Galaxy A34 5G
Samsung Galaxy A34 5G

అంటే, ఈ ఫోన్ లాంఛ్ అయిన నాటి నుండి ఇప్పటి వరకూ మొత్తంగా భారీ తగ్గింపును అందుకొని, ప్రస్తుతం రూ. 22,189 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ ను అమేజాన్ నుండి HDFC Bank Credit EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయలు, HSBC Credit Card Non EM పెయిన్ రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను మరింత చవక ధరకే కొనుగోలు చేసే అవకాశం అందించింది అమేజాన్ ఇండియా.

Also Read : Gold Price Live: నభూతో నభవిష్యత్ అనేలా పెరిగిన గోల్డ్ రేట్.!

Samsung Galaxy A34 5G : Specs

ఇక ఈ సాంసంగ్ గెలాక్సీ A34 5జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.6 ఇంచ్ Super AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 393 PPI మరియు Gorilla Glass 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 1080 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ మెమొరీ కూడా ఉన్నాయి.

సాంసంగ్ A సిరీస్ అంటేనే కెమేరా ప్రత్యేకమైన సిరీస్ గా వచ్చింది. ఈ ఫోన్ కూడా గొప్ప కెమేరా సెటప్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 48MP(OIS)+8MP+5MP ట్రిపుల్ రియర్ కెమేరాని మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ ను కలిగి వుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo