రిలయన్స్ జియో ఫోన్ 2 పండుగ సేల్ నేటితో ముగియనుంది: ధర, డేటా ప్లాన్స్, స్పెక్స్ ఇంకా మరిన్ని వివరాలు

HIGHLIGHTS

నవంబర్ 5 నుండి 12 వరకు జీయోఫోన్ 2 పండుగ సేల్ ని ప్రకటించిన jio. నేటితో ఈ పండుగ అమ్మకాలు ముగియనున్నాయి.

రిలయన్స్ జియో ఫోన్ 2 పండుగ సేల్ నేటితో ముగియనుంది: ధర, డేటా ప్లాన్స్, స్పెక్స్ ఇంకా మరిన్ని వివరాలు

రిలయన్స్ – రూ . 2,999 కి అందిస్తున్న ఈ జియో ఫోన్ 2 అందరికి అందుబాటుకోసం, నవంబర్ 5 నుండి 12 వరకు జీయోఫోన్ 2 పండుగ సేల్ ని ప్రకటించిన jio . ఈ ఫోన్ ని కొనడానికి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు  jio.com మరియు myjio యాప్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ జియోఫోన్ 2 నేటితో ఈ పండుగ అమ్మకాలు ముగియనున్నాయి. ఈ పండుగ సేల్ నుండి paytm ద్వారా కొనుగోలు చేయడం ద్వారా 200 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

 జియోఫోన్ 2  క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ డివైజ్లో 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.

జియో ఫోన్ 2 డేటా ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి మూడు పథకాలతో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జీయో యాప్స్ యాక్సెస్ తో పాటుగా 28 రోజులు చెల్లబాటునిస్తుంది. ఇంకా రూ .99 ప్లానుతో, 14 జీబి డేటా, ఉచిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో ఆప్స్ యాక్సెస్ మరియు 28 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది.

చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో  అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo