Redmi Turbo 5 launched in india know the price offers and features
Redmi Turbo 5: షియోమీ గత నెల రోజులుగా టీజింగ్ చేస్తున్న కొత్త ఫోన్ రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ అండ్ బిగ్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా, ఈ ఫోన్ ను గేమింగ్ మరియు హెవీ మల్టీ టాస్కింగ్ కోసం అవసరమైన అన్ని ఫీచర్స్ తో లాంచ్ చేయడం విశేషం. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
షియోమీ రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు ప్రైస్ డీటెయిల్స్ ఈ క్రింద అందించాము.
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను టర్బో వైట్, నైట్రో బ్లూ మరియు ఆస్పాల్ట్ బ్లాక్ మూడు రంగుల్లో అందించింది. జూన్ 19వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై షియోమీ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు ఇతర ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల Axis, SBI, ICICI, HDFC, BOB మరియు Kotak బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా 9 నెలల No Cost EMI మరియు 60% బై బ్యాక్ వాల్యూ ఆఫర్ ని కూడా ఈ ఫోన్ అందించింది. అలాగే, 3 నెలల Spotify ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కూడా షియోమీ అందించింది.
Also Read: కేవలం రూ. 3,999 ధరకే పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ అందుకోండి.!
రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే స్పెక్స్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ లో 6.59 అంగుళాల AMOLED సూపర్ సన్ లైట్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ ఉంది. ఇది 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి కలిగి ఉంటుంది. అంతేకాదు, HDR10+, HDR Vivid మరియు Dolby Vision వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి వుంటుంది.
రెడ్‌మీ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Ultra ప్రాసెసర్ శక్తితో అందించింది. ఇది 2.3 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు దానికి జతగా 12 LPDDR5X RAM మరియు 256GB UFS 4.1 స్టోరేజ్ ని కూడా అందించింది. దీని కారణంగా ఈ ఫోన్ మల్టీటాస్కింగ్, గేమింగ్ మరియు రోజువారీ పర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉంటుంది. Android 16 ఆధారిత Hyper OS 3 తో ఈ ఫోన్ వస్తుంది. అలాగే, దీర్ఘకాలిక సాఫ్ట్ వేర్ మరియు సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 50MP OIS ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా తో పాటు ముందు సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్, పోర్ట్రెయిట్ వీడియో మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ లో 7560 mAh భారీ బ్యాటరీ సెటప్ ని అందించింది మరియు 100W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP66, IP68 మరియు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, NFC, Wi-Fi 6 మరియు Bluetooth 5.4 వంటి ప్రీమియం ఫీచర్లు కూడా రెడ్‌మీ ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.