ఈరోజు జరగనున్న రెడ్మి నోట్ 9 ప్రో ఫ్లాష్ సేల్ ..
Redmi Note 9 Pro యొక్క అమ్మకాలను మొదలుపెట్టింది.
ఈ ఫోన్ను, mi.com మరియు అమేజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.
ఇటీవల, షావోమి ఇండియాలో విడుదల చేసినటువంటి షావోమి రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ లాక్ డౌన్ కారణంగా నిలిపివేసింది. ఇప్పుడు, ప్రభుత్వ ఉత్తర్వుల అనుగుణంగా, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలను మొదలుపెట్టింది. ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి ఉన్నవారు, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలుకానున్న సేల్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ను, mi.com మరియు అమేజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.
Surveyప్రస్తుతానికి గ్రీన్ జోన్ మరియు ఆరెంజ్ జోన్లలో మాత్రమే డెలివరీ ఉంటుందని తెలుస్తోంది. రెడ్ జోన్ లో అన్ని రకాల ఇ-కామర్స్ డెలివరీలు మూసివేయబడ్డాయి. కాబట్టి, మీరు రెడ్ జోన్‌లో ఉంటే మంగళవారం ఫ్లాష్ సేల్‌లో ఒకసారి మీ ఏరియా వివరాలతో ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
రెడ్మి నోట్ 9 ప్రో : ప్రత్యేకతలు
ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్, కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది.
ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో ఒక 5020mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది మరియు 18W ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
