రెడ్మి నోట్ 8T స్మార్ట్ ఫోన్ను NFC మరియు 18వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ చేయవచ్చు

HIGHLIGHTS

ఈ రెడ్మి నోట్ 8 T ఎన్‌సిసి జాబితాలో కనిపించింది

రెడ్మి తన నోట్ 8 లైనప్‌ను విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే, రెడ్మి నోట్ 8T స్మార్ట్ ఫోన్ను త్వరలో విడుదల చేయడానికి చూస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్ను ఎన్‌సిసి జాబితాలో గుర్తించారు, ఇది హ్యాండ్‌ సెట్ యొక్క అనేక వివరాలను వెల్లడించింది. ఈ రెడ్మి నోట్ 8 T ఎన్‌సిసి జాబితాలో కనిపించింది, కానీ సంస్థ నుండి మాత్రం ఎటువంటి అధికారిక టీజర్లు ఇంకా రాలేదు.

ఆరోపించిన ఎన్‌సిసి లిస్టింగ్ ప్రకారం, ఈ రెడ్మి నోట్ 8 టికి ఇటీవల ప్రారంభించిన రెడ్మి నోట్ 8 కలిగినటువంటి  ఫీచర్లు వంటివాటినే కలిగి ఉంటుంది. వీటితో పాటు, రెడ్మి నోట్ 8 T  NFC  ఆన్‌ బోర్డ్‌తో ప్రారంభించవచ్చు. ఈ జాబితాదీన్ని  M1908C3XG మోడల్ నంబర్‌తో చూపిస్తుంది. ఇంకా, ఈ డివైజ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉండవచ్చని పేర్కొంది.

గత లీక్‌ ల ప్రకారం, రెడ్మి నోట్ 8 Tలో ఒక 6.3-అంగుళాల డిస్ప్లే ను డ్యూ డ్రాప్ నోచ్ తో కలిగి ఉండవచ్చు. ఇది ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌ సెట్ యొక్క శక్తితో ఉండవచ్చు. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 48 MP  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు హెడ్‌ ఫోన్ జాక్‌తో కూడి ఉంటుంది.

అదనంగా, ఈ రెడ్మి 8 T  మల్టి ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్‌లలో రావచ్చు. మూడు వేరియంట్లలో, 32 జీబీ స్టోరేజ్‌తో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో 4 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంచవచ్చని మునుపటి నివేదికలు పేర్కొన్నాయి. 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 199 గా ఉంటుందని, ఇది సుమారు రూ .15,500 కు సమానంగా ఉంటుందని చెప్పారు.

వాస్తవానికి,  రెడ్మి నోట్ 8 T లభ్యతపై ఇంకా ఎటువంటి వివరాలు బయటకిరాలేదు, అయితే ఇది ఎన్‌సిసి జాబితాలో కనిపించినందున త్వరలో ప్రారంభించవచ్చని అంచనావేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :