REDMI NOTE 8 ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవనుంది

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క కెమేరా విభాగంలోనే కాకుండా, మరిన్ని ఫీచర్లలో బెస్ట్ అనిపించేలా ఉంటుంది

REDMI NOTE 8 ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవనుంది

ఇండియాలో, షావోమి సంస్థ కేవలం రూ.9,999 ధరలో ఒక 48MP ప్రధాన కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో తీసుకొచ్చిన REDMI NOTE 8 యొక్క ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూస్తున్న వారికీ శుభవార్త. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ mi.com మరియు అమెజాన్ ఇండియా నుండి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క కెమేరా విభాగంలోనే కాకుండా, మరిన్ని ఫీచర్లలో బెస్ట్ అనిపించేలా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 8   : ధరలు

1. రెడ్మి నోట్ 8 (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8 (6B +128GB ) – Rs.12,999/-

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8  ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.      

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile