రెడ్మి నోట్ 8 సిరిస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కంపెనీ యొక్క ఇండియా ఎండి మను కుమార్ జైన్ ప్రకటించారు.
షావోమి, ఇటీవల తన రెడ్మి నోట్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది, ఇందులో రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రో కూడా ఉన్నాయి. ఈ కొత్త రెడ్మి నోట్ 8 ప్రో 64 MP కెమెరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోనుగా టైటిల్‌ను దక్కించుకోగా, నోట్ 8 మాత్రం ఒక 48MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే, కేవలం రానున్న ఎనిమిది వారాల వ్యవధిలో ఈ హ్యాండ్‌సెట్‌లను భారతదేశంలో ప్రవేశపెడతామని, ఈ కంపెనీ యొక్క ఇండియా ఎండి మను కుమార్ జైన్ ప్రకటించారు. భారతదేశంలో, అధికారిక లాంచ్ కోసం ఈ కొత్త పరికరాన్ని ధృవీకరించడానికి మరియు పరీక్షించడానికి కంపెనీకి ఎక్కువ సమయం అవసరమని మనూ తెలిపారు.
Surveyరెడ్‌మి నోట్ 8 ప్రత్యేకతలు (China)
షావోమి రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోన్‌లో, ఒక 6.3-అంగుళాల డాట్ నాచ్ స్క్రీన్ లభిస్తుంది, దీనికి తోడు ఇది సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ తో లభిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ అందుతుంది. దీనిలో, ఒక 48MP ప్రాధమిక కెమెరా వస్తుంది. దేనికి జతగా, ఒక 8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, మరొక 2MP మాక్రో లెన్స్ మరియు చివరిదిగా ఒక 2MP డెప్త్ సెన్సారుతో ఉంటుంది . దీని ద్వారా మీరు పోర్ట్రెయిట్ ఫోటోలను తీయవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 13MP తక్కువ-కాంతి(Low-Light ) కెమెరాని అందించింది. ఇది AI ఎనేబుల్ తోమంచి ఫోటోలను తీయవచ్చు.
ఇందులో ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అందించింది. అలాగే, ఇందులో కూడా ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చింది మరియు ఇది యుఎస్‌బి టైప్ సి పోర్టుతో ఉంటుంది.
షావోమి రెడ్మి నోట్ 8 ధర (China)
రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ చైనాలో RMB 999 ధరతో ప్రకటించింది, అంటే మనకు ఇది సుమారు 10,000 రూపాయలు అవుతుంది. ఈ ధర వద్ద మీరు 4GB RAM మరియు 64GB స్టోరేజి ఫోన్ను పొందవచ్చు. ఇది కాకుండా, 6GB ర్యామ్ మరియు 64GB వేరియంట్‌ను RMB 1,199 ధరతో ప్రకటించింది, అంటే సుమారు 12,000 రూపాయలు అన్నమాట. మరొక వేరియంట్ అయినటువంటి 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ మోడల్‌ను సుమారు RMB 1,399 ధరతో తీసుకచ్చింది, అంటే సుమారు 14,000 రూపాయలు.
రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు (China)
ఇది కాకుండా, రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ గురించి చూస్తే, ఇది ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. మీరు దీన్ని కొత్త జాడే గ్రీన్ కలర్‌లో అందుకోనున్నారు. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకముగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్ తోఈ స్మార్ట్ ఫోన్నుఅందుకోనున్నారు .
రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్‌లో, గరిష్టంగా ఒక 64 MP కెమెరాను అందుకోనున్నారు, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది.
రెడ్‌మి నోట్ 8 ప్రో ధర (China)
ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ యొక్క ధరల విషయానికి వస్తే, 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ మోడల్‌ను RMB 1,399 ధరకే తీసుకోవచ్చు, అంటే సుమారు 14,000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది కాకుండా, మరొక 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌ను సుమారు RMB 1,599 ధరతో అందించింది, అంటే సుమారు 16,000 రూపాయలు. అయితే, హై ఎండ్ వేరియంట్ అయినటువంటి 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకోవాలనుకుంటే, RMB 1,799 ధర వద్ద తీసుకోవచ్చు, అంటే సుమారు 18,000 రూపాయలు
At the launch of #RedmiNote8 & #RedmiNote8Pro in China!
![]()