రెడ్మి నోట్ 8 ఒక స్నాప్ డ్రాగన్ 665 SoC మరియు 48MP క్వాడ్ కెమేరాతో రానుంది

రెడ్మి నోట్ 8 ఒక స్నాప్ డ్రాగన్ 665 SoC  మరియు 48MP క్వాడ్ కెమేరాతో రానుంది
HIGHLIGHTS

రెడ్మి నోట్ 8 డిజైన్‌ను కూడా ధృవీకరించి

త్వరలో, రెడ్మి నోట్ 8 సిరీస్ విడుదల కానుంది మరియు త్వరలో తీకురానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి, కంపెనీ చాలా ఎక్కువ ప్రచారం కూడా చేస్తోంది. రెడ్మి  నోట్ 8 గురించి ప్రచారం చేస్తున్న విషయాలను గురించి చూస్తే, ఈ ఫోన్ ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్న స్మార్ట్‌ఫోన్‌ గా,  కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్మి నోట్ 8 డిజైన్‌ను కూడా ధృవీకరించి, ఈ స్మార్ట్‌ఫోన్ను ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు.

ఇక ఆప్టిక్స్ గురించి మాట్లాడితే, రెడ్మి యొక్క రానున్న రెండు స్మార్ట్‌ఫోన్‌లలోనూ విభిన్న కెమెరా మాడ్యూళ్ళను చేర్చబోతోంది. ఒక వైపు, కెమెరా మాడ్యూల్‌కు రెడ్మి నోట్ 8 ప్రోలో మధ్య స్థలం ఇవ్వబడుతుందని, అలాగే రెడ్‌మి నోట్ 8 వెనుక కెమెరా సెటప్ ప్యానెల్‌లో ఎడమ వైపున ఉంటుందని చెబుతున్నారు. అదనంగా, రెడ్మి నోట్ 8 వెనుక భాగంలో 48 MP ప్రధాన సెన్సార్ మరియు వైడ్ యాంగిల్ లెన్స్, మరొక మాక్రో లెన్స్ కెమెరా మరియు డెప్త్ -ఫీల్డ్ కోసం నాల్గవ సెన్సార్ అందించబడతాయి. అయితే, 48MP సెన్సార్ గురించి ఇంకా నిర్ధారించలేదు.

కంపెనీ, రెడ్మి నోట్ 8 నుండి తీసిన కొన్ని లో -లైట్ షాట్‌లను పోస్ట్ చేసింది, ఇది 12 MP ఇమేజ్‌ను రూపొందించడానికి ఫోర్-ఇన్-వన్ బిన్నింగ్‌ను ఉపయోగిస్తుందని పేర్కొంది.

రెడ్మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వెల్లడించారు. ఈ చిప్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్‌కు అప్‌గ్రేడ్, ఇది మనము ముందుగా Mi A3 లో చూశాము. తక్కువ బ్యాటరీ వినియోగం, Vulkan 1.1 API  సపోర్ట్ మరియు Hexagon 686 DSP థర్డ్-జెన్ AI ఇంజిన్‌తో, రెడ్మి నోట్ 8 ప్రవేశపెట్టబడుతుందని ఆశిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo