రెడ్మి నోట్ 8 లాంచ్ డేట్ ఫిక్స్ : అక్టోబర్ 16 న విడుదలకానుంది

రెడ్మి నోట్ 8 లాంచ్ డేట్ ఫిక్స్ : అక్టోబర్ 16 న విడుదలకానుంది
HIGHLIGHTS

ఈ కార్యక్రమానికి మీడియా ఆహ్వానాలను కూడా పంపింది.

షావోమి తన చైనాలో ముందుగా విడుదల చేసినటువంటి రెడ్మినోట్  8 ప్రో స్మార్ట్ ఫోన్నుఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది మరియు ఈ కార్యక్రమానికి మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అంతేకాదు,  రెడ్మి ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఇమేజిని కూడా పోస్ట్ చేసింది, రెడ్మి నోట్ 8 ప్రో ను భారతదేశంలో అక్టోబర్ 16 న ప్రారంభించనున్నట్లు సూచించింది. ఈ ట్వీట్‌లో రెడ్మి ఇండియా దాని రాబోయే స్మార్ట్‌ ఫోన్ గురించి తక్కువ సమాచారాన్ని వెల్లడించింది. అయితే,  రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రో ఈ ఏడాది ఆగస్టులో చైనాలో తొలిసారిగా ప్రారంభించబడ్డాయి. రెడ్మి నోట్ 8 ప్రో ప్రారంభించే సమయానికి ఇది సుమారు రూ .14 వేలు ధరతో రావచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే,  రెడ్మి ఇండియా రెండు మోడళ్లను కూడా ఒకే రోజున లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అనగా రెడ్మి నోట్ 8 ప్రో మరియు కొంచెం చిన్నదైన రెడ్మి నోట్ 8. ముందుగా  వచ్చిన ఫోన్ల  వివరాలు చూసినట్లయితే, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7 కు ఈ రెండు ఫోన్‌లు వారసులుగా ఉంటాయి . గత ఏడాది కేవలం  ‘ప్రో’ వెర్షన్ కోసం కంపెనీ రెడ్మి నోట్ 6 ను పూర్తిగా దాటవేసిన వాస్తవాన్ని పరిశీలిస్తే, ఈ ఏడాది రెడ్మి నోట్ 8 విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నారు.

ఈ రెడ్మి నోట్ 8 ప్రో యొక్క అత్యంత ముఖ్యమైన ప్రత్యేకతగా దాని వెనుక ప్యానెల్‌లోని క్వాడ్-కెమెరా సెటప్ గా చెప్పొచ్చు. ఈ ప్రాధమిక సెన్సార్ f / 1.7 యొక్క ఎపర్చరుతో శామ్సంగ్-అభివృద్ధి చెందిన 64MP సెన్సార్ తో ఉంటుంది. ఇతర సెన్సార్లలో 8MP అల్ట్రా-వైడ్ యూనిట్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, ఈ ఫోన్ యొక్క 6.53-అంగుళాల FHD + డిస్ప్లే పైన ఒక చిన్న ‘డ్రాప్’ నోచ్ లో ఉంచబడిన ఒక 20MP సెల్ఫీ షూటర్ ఉంది. ఈ ఫోన్ సెకనుకు 960 ఫ్రేమ్‌ల వద్ద వీడియోను రికార్డ్ చేయగలదని కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన రెడ్మి నోట్ 8 ప్రో ఒక మీడియాటెక్ హెలియో జి 90 టి చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, వీటిలో 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అదే కాన్ఫిగరేషన్ భారతదేశానికి కూడా వస్తుందని భావిస్తున్నారు. అదనంగా, రెడ్మి నోట్ 8 ప్రో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుగా 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఫోన్ MIUI 10 లో నడుస్తుంది. ఇందులో ఎన్‌ఎఫ్‌సి, స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మరియు 3.5 MM ఆడియో జాక్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo