రెడ్మి నోట్ 8 మరియు నోట్ 8 ప్రో : ఈరోజే మరొక ఫ్లాష్ సేల్

రెడ్మి నోట్ 8 మరియు నోట్ 8 ప్రో : ఈరోజే మరొక ఫ్లాష్ సేల్
HIGHLIGHTS

18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.

షావోమి, ఇండియాలో మంచి కెమేరా సేటప్పుతో తీసుకొచ్చినటువంటి REDMI NOTE 8 మరియు 8 PRO  స్మార్ట్ ఫోన్ల యొక్క రెండవ ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. అయితే, దీపావళి సందర్భంగా ఈ నోట్ 8 సీరీస్ స్మార్ట్ ఫోన్ల యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు జరిగించనున్నట్లు ప్రకటించింది.  అంటే, రాత్రి 8 గంటకి mi.com మరియు అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారాల నుండి ఈ ఫ్లాష్ సేల్ జరగనుంది.

రెడ్మి నోట్ 8  : ధరలు

1. రెడ్మి నోట్ 8  (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8  (6B +128GB ) – Rs.12,999/-

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) – Rs.14,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) – Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) – Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది. 

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo