REDMI NOTE 7S బెస్ట్ కెమేరా ఫీచర్లతో కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది
ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా 48MP కెమేరా ఫోన్లను తీసుకొచ్చే పనిలో పడినట్లు అర్ధమవుతోంది. ముందుగా, ఇండియాలో ఒక 48MP కెమేరాతో కేవలం రూ.13,999 ప్రారంధరతో తీసుకొచ్చినటువంటి రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ విజయవంతమవడంతో, చావోమి ఇప్పుడు మరిక స్మార్ట్ ఫోన్ను అటువంటి కేమేరాతోనే, నోట్ 7 సిరీస్ నుండి మరొక సామ్రాట్ ఫోన్ను ఈ రోజు విడుదల చేసింది. అదే, రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్. ఇది కేవలం రూ. 10,999 ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా మరియు క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో విడుదయ్యింది.
Surveyరెడ్మి నోట్ 7 ప్రో ధర
Redmi Note 7S – 3GB + 32GB – Rs. 10,999
Redmi Note 7S – 4GB + 64GB – Rs. 12,999
REDMI NOTE 7S : ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ను షావోమి సంస్థ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిచగల ఒక 6.3 అంగుళాల FHD + డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లే ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిజైనుతో అందించింది. అంతేకాకుండా, దీన్ని ఒక గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడుతో ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6602 ఆక్టా కోర్ ప్రాసెస్సరుతో వస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 3GB/4GB ర్యామ్ జతగా 32GB /64GB స్టోరేజి ఎంపికలతో తీసుకొచ్చింది. ఇందులో అధనంగా, క్వాల్కామ్ క్విక్ చార్జర్ 4.0 కి సపోర్టు చేయగల ఒక 4,000 mAh బేటరీతో అందించింది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో f/1.8 అపర్చరు కలిగిన 48MP ప్రధాన కెమెరాగా అందించింది. దీనికి జతగా మరొక కెమేరాని కూడా కలిపి ఒక డ్యూయల్ రియర్ కెమేరాగా అందించింది. ఆయితే, ఈ సెన్సార్ కి సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటించలేదు. కెమేరాతో మంచి రిజల్యూషన్ ఫోటోలను తీసుకోవచ్చని చెబుతోంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ఇందులో అందించిన సెల్ఫీ కెమేరావివరాలను కూడా ఈ ఫోన్ లాంచ్ సమయంలో వివరించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోను యొక్క మొదటి సేల్ మాత్రం మే నెల 23 వ తేది నుండి Flipkart, mi.com మరోయు మి హోమ్ నుండి చేయనున్నట్లు, షావోమి తెలిపింది.