50 లక్షల అమ్మకాలు మార్క్ దాటినా రెడ్మి నోట్ 7 సిరీస్ అమ్మకాలు

Updated on 17-Aug-2019
HIGHLIGHTS

ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడైనా ఓపెన్ సెల్‌లో కొనుగోలు చేయవచ్చు.

భారతదేశంలో, షావోమి సంస్థ కొత్త మరియు చాలా పెద్ద రికార్డును నమోదు చేసింది. ఏమిటది అనుకుంటున్నారాషావోమి తన  రెడ్మి నోట్ 7 మొబైల్ ఫోన్ సిరీస్ అత్యధికంగా అమ్ముడైన ఫోన్లుగా రికార్డును సృష్టించిందిరెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్లను ఇప్పుడు ఓపెన్ సెల్లో అందుబాటులోకి తెచ్చినట్లు మనకు తెలుసు, అయితే సెల్ కొద్ది రోజులు మాత్రమే కొనసాగింది. అయితే, అందిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ 5 మిలియన్ యూనిట్ల అమ్మకాలను సిరీస్ ఫోన్లు సాధించినట్టు చూపిస్తుంది. అంటేషావోమి రెడ్మి నోట్ 7 సిరీస్ భారతీయ మార్కెట్లో 50 లక్షల యూనిట్ అమ్మకాలను సాధించింది.

ఈఇప్పటివరకూ సుమారు 50 యూనిట్లు అమ్ముడయ్యాయని షావోమి ప్రకటించింది. ఇది ఒక పెద్ద రికార్డ్ గా చెప్పవచ్చు. ఇందులో అమ్ముడైన యూనిట్ల గురించి మాట్లాడితే, అందులో రెడ్మి నోట్ 7, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి 7 ఎస్ వంటి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. నోట్ 7 సిరీస్ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశంలో ప్రారంభించబడింది మరియు ప్రారంభించినప్పటి నుండి సిరీస్ అనేక పెద్ద రికార్డులు సృష్టించింది.

ఇది కాకుండా, షావోమి రెడ్మి నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్ను ఇప్పుడు భారతదేశంలోని ఓపెన్ సెల్లో అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తరపున ప్రకటించారు, అంటే మీరు మొబైల్ ఫోన్ కొనడానికి ఎదురుచుస్తున్న వారిలో ఒకరైతే, మీరు ఇక ఫ్లాష్ సేల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొబైల్ ఫోన్ను ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడైనా ఓపెన్ సెల్లో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :