ఇటీవల POCO F1 స్మార్ట్ ఫోను అందుకున్నటువంటి, గేమ్ టర్బో మోడ్ ని ఇప్పుడు రెడ్మి నోట్ 7 ప్రో కూడా అందుకుంది. దీని ద్వారా CPU మరియు GPU యొక్క పనితీరు మరింత వేగవంతం చేయబడుతుంది. తద్వారా, గేమింగ్ పనితీరు మరింత మెరుగ్గా మారుతుంది. అంటే మీరు ఈ మొబైల్ ఫోన్లో అంటే రెడ్మి నోట్ 7 ప్రోలో PUBG మొబైల్ వంటి హై ఎండ్ గ్రాఫిక్ గేమ్స్ మరింత సున్నితంగా మరియు సునాయాసంగా ఆడవచ్చు.
ముందుగా, పోకో ఎఫ్ 1 మొబైల్ ఫోన్లు కూడా ఈ అప్డేట్ ను అందుకున్నాయి. అలాగే, ఇప్పుడు రెడ్మినోట్ 7 ప్రో ఫోన్‌కు కూడా గేమ్ టర్బో మోడ్ ఇవ్వబడిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ, త్వరలోనే ఈ అప్డేట్ రెడ్మి నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్‌కు కూడా వస్తుందని చెప్పబడింది. ఇది ఇప్పుడు ఇందులో అందినట్లు కనిపిస్తోంది. ఈ మొబైల్ ఫోన్‌కు అధికారికంగా ఈ అప్డేట్ ఇవ్వబడింది. రెడ్మి నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్‌కు గేమ్ టర్బో మోడ్ లభించింనట్లు వీబోలో కనిపించింది.
ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది. ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్, పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది. ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ 48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది. ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది.
ఇందులో అతితక్కువ 1.6um 4-ఇన్-1 సూపర్ పిక్సెల్స్ తో అద్భుతంగా ఉంటుంది, ఈ కెమెరా సెన్సార్‌లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది. ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణంతో ఉంటాయి, సామాన్యంగా ప్రస్తుత ఫోనులో ఇది కేవలం 4MB నుండి 6MB మధ్య ఉంటుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది