రెడ్మి నోట్ 6 ప్రో మరోక సేల్ :3PM కి mi.com లో ప్రారంభమవుతుంది

HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్లో 6 లక్షల యూనిట్లను అమ్మినట్లు తెలిపింది.

రెడ్మి నోట్ 6 ప్రో మరోక సేల్ :3PM కి mi.com లో ప్రారంభమవుతుంది

ఈ రోజు మధ్యాహ్నం 12PM కి జరగిన సేల్ నుండి కొనుగోలు చేయలేక పోయిన వారికోసం, మధ్యాహ్నం 3 గంటలకి మరొక సేల్ అందుతులో ఉండనుంది.  ముందుగా ప్రకటించినట్లుగా, mi.com నుండి మధ్యాహ్నం 12PM గంటలకు సేల్ జరిగింది, మరియు మరొక సేల్ 3PM కి  ప్రారంభంకానుంది దీని ధర 13,999 నుండి ప్రారంభవవుతుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 6 ప్రో ధరలు

4GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ ధర –  రూ. 13,999

6GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ ధర –  రూ. 15,999

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో – స్పెసిఫికేషన్స్

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఆడ్రినో 509 GPU శక్తితో వస్తుంది. ఇది 19: 9 కారక నిష్పత్తిలో కొంచెం పెద్ద ఒక 6.26-అంగుళాల Full HD + IPS LCD డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 86 శాతం స్క్రీన్ నుండి బాడీ నిష్పత్తి, మరియు దాని స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ 500 nits ఇంకా ఇది ఒక 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది . ఈ ఫోన్ 64GB అంతర్గత నిల్వతో పాటు 4GB మరియు 6GB RAM తో వస్తుంది. అలాగే, మైక్రో SD కార్డుతో దీని స్టోరేజిని 256GB వరకు విస్తరించవచ్చు. 

ఆప్టిక్స్ పరంగా చుస్తే, Redmi Note 6 ప్రో డ్యూయల్  12 + 5 MP సెన్సార్స్ కలిగి వస్తుంది. ఈ 12 MP సెన్సార్ 1.4um పిక్సెళ్ళు మరియు డ్యూయల్  ఆటో-ఫోకస్ మద్దతుతో f / 1.9 ఎపర్చరును కలిగి ఉంది. రెండవ సెన్సార్ 5MP డీప్ సెన్సార్. అలాగే ముందు, ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది. ముందు కెమెరా ప్రాక్సిమిటీ / పరిసర కాంతి సెన్సర్, స్పీకర్ మరియు నోటిఫికేషన్ లైట్తోపాటు, నోచ్ లోపల ఉంచబడుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ 4000mAh బ్యాటరీ చేత శక్తి పొందుతుంది, ఇది ఒక పూర్తి ఛార్జ్ తో 2 రోజులు వరకు పనిచేస్తుందని సంస్థ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo