Redmi Note 17 Pro Max India launch announced and know what to expect
Redmi Note 17 Pro Max: ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన షియోమీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టు మాక్స్ బ్యాటరీ మరియు మాక్స్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్ వర్గాలు ఏమనుకుంటున్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
రెడ్ మీ నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను ఈ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 14 లేదా 15 తేదీల్లో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు అని కూడా అంచనా వేసి చెబుతున్నారు. అయితే, అఫీషియల్ డేట్ వచ్చే వరకు మనం లాంచ్ డేట్ గురించి క్లియర్ గా చెప్పలేము.
Also Read: BSNL Freedom 2.0: ఒక్క రూపాయికే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
రెడ్ మీ నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, అలసిపోకుండా పని చేసే కొత్త నోట్ ను కలుసుకోవడానికి వేచి ఉండండి, అని ఈ ఫోన్ గురించి కంపెనీ టీజర్ లో తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చాలా అంచనాలు మార్కెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.