Redmi Note 17 5G భారీ EV గ్రేడ్ 8000 mAh బ్యాటరీ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

Redmi Note 17 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఎలక్ట్రిక్ వెహికల్ EV గ్రేడ్ 8000 mAh బ్యాటరీ మరియు AMOLED స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

ఈ ఫోన్ తో గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని షియోమీ అందించింది

Redmi Note 17 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్ట్రిక్ వెహికల్ EV గ్రేడ్ 8000 mAh బ్యాటరీ మరియు AMOLED స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది. ప్రస్తుతం పెరిగిన స్మార్ట్ ఫోన్ ప్రైస్ ను దృష్టిలో ఉంచుకుంటే, ఇది ఆకట్టుకునే ధరలో లాంచ్ అయినట్లు కూడా చెప్పవచ్చు. ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకుందామా.

Redmi Note 17 5G : ప్రైస్

రెడ్ మీ ఈ ఫోన్ ను రెండు వేరియంట్ ఆప్షన్ లో అందించింది. ఇందులో బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 27,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ హైఎండ్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 30,999 ధరతో రిలీజ్ చేసింది. అయితే, ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకోవడానికి వీలుగా మంచి బ్యాంక్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ఆర్క్టిక్ బ్లూ, స్టార్ లైట్ పర్పల్ మరియు డార్క్ నైట్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్ అండ్ సేల్

ఈ ఫోన్ తో గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని షియోమీ అందించింది. ఈ ఫోన్ ను ICICI, Axis, SBI, IDFC మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆప్షన్ తీసుకునే వారికి రూ. 3,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, UPI తో కొనే వారికి కూడా రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, మూడు నెలల Youtube Premium సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.

Also Read : Vivo S2: కళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో రిలీజ్ అయ్యింది.!

Redmi Note 17 5G : ఫీచర్స్

షియోమీ ఈ ఫోన్ ను పెద్ద 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ FHD+ (2396 × 1080) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 4 Gen 4 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ లో 6GB / 8GB ర్యామ్ మరియు 128GB / 256GB స్టోరేజ్ ఎంపికలను కూడా అందించింది. యూజర్ బడ్జెట్ ను బట్టి తగిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఈ ఫోన్ లో PDAF ఆటోఫోకస్ సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా అందించింది. అలాగే 8MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ షియోమీ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో కేవలం FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. ఈ రెడ్ మీ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వెహికల్ EV గ్రేడ్ 8000 mAh భారీ బ్యాటరీ తో వచ్చింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది.

ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే, IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :