Redmi Note 15: కేవలం 7.35mm సూపర్ స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.!
రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన షియోమీ
ఈ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది
ఈ ఫోన్ కేవలం 7.35mm సూపర్ స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది
Redmi Note 15: రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన షియోమీ, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, ప్రాసెసర్ మరియు బ్యాటరీ వంటి వివరాలు ముందే వివరించిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ డిజైన్ వివరించే కొత్త వివరాలు కూడా వెల్లడించింది. ఈ ఫోన్ కేవలం 7.35mm సూపర్ స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని షియోమీ తెలిపింది.
SurveyRedmi Note 15: ఫీచర్స్ ఏమిటి?
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం 7.35mm సూపర్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ మిస్ట్ పర్పల్ ఫోన్ మాత్రం 7.4mm మందంతో ఉంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వెనుక పెద్ద స్క్వేర్ బంప్ లో డ్యూయల్ కెమెరా కెమెరా సెటప్ తో ఆకర్షణీయమైన డిజైన్ తో ఉన్నట్లు కొత్త టీజర్ ఇమేజ్ వెల్లడించింది.
ఈ ఫోన్ ముందు మరియు వెనుక కూడా కర్వుడ్ డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ లో రియర్ కెమెరా సెటప్ లో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అవసరమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. అవేమిటంటే, ఈ ఫోన్ స్క్రీన్ గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటే, ఫోన్ లో ఎక్కువ సమయం సినిమాలు సిరీస్ కు చూసినా కళ్ళకు హాని కలగని TUV ట్రిపుల్ ఐ కేర్ సపోర్ట్ ఉంటుందని షియోమీ చెబుతోంది.
Also Read: Oppo Reno 15 Series: 2026 కొత్త సంవత్సరం కోసం కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
ఈ రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ లో ఉన్నా కూడా ఈ ఫోన్ ను పెద్ద 5520 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ తెలిపింది. అదనంగా, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెడ్ మీ ఫోన్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Redmi Note 15: లాంచ్ డేట్
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ 2026 జనవరి 6వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది.