Redmi Note 15: స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ రీవిల్ చేసిన షియోమీ.!

HIGHLIGHTS

Redmi Note 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కి సిద్ధం అయ్యింది

ఈ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ వేగం పెంచింది

అమెజాన్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది

Redmi Note 15: స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ రీవిల్ చేసిన షియోమీ.!

Redmi Note 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కి సిద్ధం అయ్యింది మరియు ఈ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ వేగం పెంచింది. ఈ ఫోన్ టీజింగ్ కోసం అమెజాన్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది. ముందు కెమెరా వివరాలు అందించిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ చిప్ సెట్ వివరాలు కూడా అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 15 : ఎప్పుడు లాంచ్ అవుతుంది?

రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని మాత్రమే కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తోంది.

Redmi Note 15 : కీలక ఫీచర్స్

రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కర్వుడ్ డిజైన్ మరియు వెనుక కర్వుడ్ బ్యాక్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో Snapdragon 6Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ చిప్ సెట్ దీనికంటే ముందు వచ్చిన చిప్ సెట్ కంటే 10% GPU బూస్ట్, 30% CPU బూస్ట్ మరియు 48 నెలల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని షియోమీ టీజింగ్ చేస్తోంది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరా మరియు బ్యాటరీ వివరాలు కూడా కంపెనీ ముందే రివీల్ చేసింది. రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ లో 5520 mAh బ్యాటరీ ఉంటుంది మరియు ఇది 5 సంవత్సరాల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ OIS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైనమిక్ షాట్ మరియు మల్టీ ఫోకల్ పోర్ట్రైట్ లెజెండ్ వంటి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: 5G Network ఉన్నా చాలా మందికి ఎందుకు ఫుల్ స్పీడ్ రావడం లేదు.. అసలు కారణం ఇదే.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్స్ కూడా త్వరలోనే ప్ వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo