Xiaomi: ఇండియాలో విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్

Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ జనవరి 5 న ఇండియాలో లాంచ్ అవుతోంది

Redmi Note 12 లైనప్ అక్టోబర్‌లోనే చైనాలో ప్రారంభించబడింది

Xiaomi: ఇండియాలో విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్.!

Xiaomi: ఇండియాలో విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్. అదే, Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను జనవరి 5 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. వాస్తవానికి, Redmi Note 12 లైనప్ అక్టోబర్‌లోనే చైనాలో ప్రారంభించబడింది మరియు చైనాలో Redmi Note 12, Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro + లను లాంచ్ చేసింది. అయితే, ఇండియాలో రెడ్ మీ నోట్ 12 ప్రో+ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి ఫీచర్లను ఆశించవ్చనో చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 12 Pro+ 5G: స్పెక్స్ (అంచనా)

చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల FHD+ OLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగివుంది. ఇది ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ Dimensity 1080 SoC శక్తితో పనిచేస్తుంది మరియు 12GB LPDDR4X RAM మరియు Mali-G68 GPU వరకు అందిస్తుంది.

Redmi Note 12 Pro+ వెనుతికె ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది మరియు ఇది OIS సామర్థ్యాలతో కూడిన 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2-MP మాక్రో లెన్స్‌ని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో సెల్ఫీల కోసం 16MP సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo