Install App Install App

Redmi Note 11T 5G: భారీ స్పెక్స్ మరియు భారీ ఆఫర్లతో విడుదల

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 30 Nov 2021
HIGHLIGHTS
  • ఈరోజు ఇండియన్ మార్కెట్లోకి మరొక 5G స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది

  • షియోమి యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G

  • మొత్తంగా 2000 రూపాయల డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను కొనేవీలుంది

Redmi Note 11T 5G: భారీ స్పెక్స్ మరియు భారీ ఆఫర్లతో విడుదల
Redmi Note 11T 5G: భారీ స్పెక్స్ మరియు భారీ ఆఫర్లతో విడుదల

ఈరోజు ఇండియన్ మార్కెట్లోకి మరొక 5G స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది. అదే, షియోమి యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో వచ్చినా కూడా ఇంట్రడక్టరి అఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ఇంట్రడక్టరి అఫర్ క్రింద 1,000 రూపాయల డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ICICI బ్యాంక్ కస్టమర్లకు 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. అంటే, మొత్తంగా 2000 రూపాయల డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను కొనేవీలుంది.  

Redmi Note 11T 5G: ప్రైస్

రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB  (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.17,999. ఇక చివరిడి 8GB ర్యామ్ మరియు 128GB  (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.19,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Amazon, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది.       

Redmi Note 11T 5G: స్పెక్స్

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.      

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Redmi Note 11T 5G launched with best offers in india
Tags:
Redmi Note 11T 5G Redmi Note 11T 5G india launch Redmi Note 11T 5G price in india Redmi Note 11T 5G specs Redmi Note 11T 5G camera
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status