Redmi Note 11T 5G: నవంబర్ 30న లాంచ్ అవుతోంది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Redmi Note 11T 5G: నవంబర్ 30న లాంచ్ అవుతోంది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
HIGHLIGHTS

రెడ్ మి నోట్ 10టి 5జి యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా మార్కెట్లోకి

Redmi Note 11T 5G ను ఈ నెల 30 వ తేదికి లాంచ్

రెడ్ మి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G ను ఈ నెల 30 వ తేదికి లాంచ్ చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కీలకమైన ఇప్పుడు బయటకి వచ్చింది. ప్రముఖ టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ అప్ కమింగ్ రెడ్ మి 5G ఫోన్ గురించి వెల్లడించారు. రెడ్ మి నోట్ 11టి 5జి స్మార్ట్ ఫోన్ రెడ్ మి నోట్ సిరీస్ యొక్క మొదటి 5జి ఫోన్ రెడ్ మి నోట్ 10టి 5జి యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Redmi Note 11T 5G లాంచ్ గురించి కంపెనీ CEO మనూ కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 11టి 5జి నవంబర్ 30న ఇండియాలో లాంచ్ కాబోతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం తన అధికారిక వెబ్సైట్ mi.com నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ పేజ్ నుండి ఫోన్ ఫీచర్ల గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది.

Redmi Note 11T 5G: అంచనా స్పెక్స్

ఇక ఈ Redmi Note 11T 5G యొక్క అంచనా స్పెక్స్ గురించి కూడా చాలా నివేదికలు వెల్లడించాయి. కంపెనీ ఈ ఫోన్ యొక్క బెస్ట్ ఫీచర్లగా తీజ్ చేస్తున్న 4 విషయాలను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ ఫాలెన్ చైనా లో ఇటీవల విడుదలైన Redmi Note 11 ఆధారితంగా ఉంటుందని కూడా అంచనా. ఈ ఫోన్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ మరియు మెరుగైన కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్  లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo