విడుదలకు ముందే లీకైన Xiaomi Note 11S మరియు Note 11 రేట్లు … ఎంతంటే ..!

HIGHLIGHTS

Xiaomi Note 11S మరియు Note 11 ఫిబ్రవరి 9న విడుదలకానున్నాయి

ఒక టిప్‌స్టర్ ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలను గురించి ముందుగానే హింట్ ఇచ్చారు

విడుదలకు ముందే లీకైన Xiaomi Note 11S మరియు Note 11 రేట్లు … ఎంతంటే ..!

ఇండియాలో ఫిబ్రవరి 9 న షియోమి చాలా ప్రోడక్ట్స్ ను విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. ఈ తేదీన జరగనున్న ఈవెంట్ ద్వారా టీవీ, స్మార్ట్ వాచ్ మరియు స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేయనున్నది. అయితే, ఫిబ్రవరి 9 న Xiaomi Note 11S మరియు Note 11 విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించిన తరువాత ఒక టిప్‌స్టర్ ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలను గురించి ముందుగానే హింట్ ఇచ్చారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లీక్ ప్రకారం, Xiaomi Note 11 స్టార్టింగ్ వేరియంట్ రూ.13,999 నుండి రూ.14,499 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, Redmi Note 11S భారతదేశంలో రూ.16,999 లేదా రూ.17,499 నుండి ప్రారంభమవుతుంది.

షియోమి వెబ్సైట్ నుండి అందించిన Redmi Note 11s టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ కి జతగా ఒక LED ఫ్లాష్ ను కూడా కలిగివుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని కలిగి ఉన్నట్లుగా ప్రకటించగా, రెండు 2MP సెన్సార్ లతో పాటుగా 8MP సోనీ IMX355 సెన్సార్‌తో కూడా రావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి 5G బ్రాండింగ్ లేకపోవడం వలన ఇది 4G సపోర్ట్ తో రావచ్చని సూచిస్తుంది.

ఈ ఫోన్ 90Hz 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు మీడియాటెక్ Helio G96 SoC చిప్‌సెట్ తో రావచ్చు. Redmi Note 11 ఫీచర్ల విషయానికి వస్తే, ఇది కూడా 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ సెట్  జతగా LPDDR4x RAM కలిగి వుండవచ్చు. కెమెరా సెటప్ పరంగా, 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి + 2ఎంపి   క్వాడ్-కెమెరా సెటప్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాని కలిగి వుండవచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo