Redmi K20 సిరీస్ ప్రీ బుకింగ్ : మధ్యాహ్నం 12 గంటలకి షురూ

HIGHLIGHTS

'Alpha Sale' గా ప్రకటించిన ఈ ప్రీ బుకింగ్ సేల్ నుండి ఈ ఫోన్ను ముందుగా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

ఇండియాలో ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో విడుదల చేయనున్నషావోమి యొక్క K20 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకోవడాకి మంచి ఆఫరును ప్రకటించింది. కేవలం రూ. 855 రూపాయలను చెల్లించి ఈ రెడ్మి K20 సిరీస్ ఫోన్ను ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రీ బుకింగ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 'Alpha Sale' గా ప్రకటించిన ఈ ప్రీ బుకింగ్ సేల్ నుండి ఈ ఫోన్ను ముందుగా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ సేల్ నుండి ప్రీ బుకింగ్ చేసుకున్నవారు ఆల్ఫా సేల్ యాక్సెస్ ను పొందుతారు. ఈ యాక్సెస్ పొందినవారు మరలా జూలై 17 న ఫోన్ లాంచ్ చేసిన తరువాత అదే తేదీన కొనుగోలును పూర్తి చేసుకోవాలి. అయితే, ఈ సేల్ నుండి మీకు నచ్చిన ఏ రకమైన వేరియంట్ అయినాసరే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, ఈ జూలై 17 వ తేదీన జరగనున్న ఆల్ఫా సేల్ నుండి కొనుగోలును పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఇక మీరు కొను గోలు చేసేప్పుడు మీరు చెల్లించిన 855 రూపాయల మొత్తం కూడా ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూపంలో అందించబడుతుంది. అంటే మీకు ఎటువంటి నష్టం వాటిల్లదు. అయితే, ఈ యాక్సస్ పాస్ పొందడానికి 855 రూపాయలను 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలయ్యే ఆల్ఫా ప్రీ బుకింగ్ సేల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కేవలం చెల్లుబాటు అయ్యే mi అకౌంట్ కలిగిం వారు మాత్రమే దీనికి అర్హులు లేదా mi ఆన్లైన్ ప్లాట్ఫారంలో అన్ని టర్మ్స్& కండిషన్లలో ఉతీర్ణమైన 'USERS' లు అర్హులు .                                                 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :