ఎట్టకేలకు, షావోమి తన రెడ్మి K20 సిరీసును ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్ నుండి రెడ్మి K20 మరియు రెడ్మీ K20 ప్రో ని కూడా లాంచ్ చేయనుంది. ముందుగా, చైనాలో విడుదల చేసిన ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ దాదాపుగా ఒకే విధంగా వుంటాయి కానీ, ఈ రెండు ఫోన్ల యొక్క ప్రాసెసరులో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ రెడ్మి K20 సిరీస్ యొక్క లాంచ్ డేట్ ను జులై 17వ తేదిగా నిర్ణయించింది.
షావోమి ఈ రెడ్మి K20 ప్రో లో 7 వ తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. రెడ్మి K20 మరియు K20 ప్రో స్మార్ట్ ఫోన్లు రెండు కూడా NFC మద్దతుతో వస్తాయి. Redmi K20 ఒక 6.39 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని అందించింది.
ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది.అయితే, రెడ్మి K20 మాత్రం ఒక స్నాప్డ్రాగెన్ 730 చిప్సెట్టుతో వస్తుంది
రెడ్మి K20 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ కెమేరాని అందించింది రెండు ఫోన్లలో, సోనీ IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్ లెన్స్ కలిగి ఉంది. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 మెగాపిక్సెల్స్ పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఇందులో, 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh,బ్యాటరీని ఇచ్చింది.
Redmi K20 Pro స్మార్ట్ ఫోన్ను 4 రకాలైన వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని బేస్ వేరియంట్ 6GB RAM మరియు 64GB స్టోరేజితో, 2499 యువాన్ (సుమారు రూ 25,000 ధరకే) ధరతో అందించారు. మరొక 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2599 యువాన్ (సుమారు రూ 26,000 ధరకే) మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2799 యువాన్ (సుమారు రూ 28,000 ధరకే) ఉంటుంది. ఇక చివరిదైన 8GB RAM మరియు 256GB స్టోరేజి వేరియంట్ 2999 యువాన్ (సుమారు రూ 30,000 ధరగా) నిర్ణయించింది.
ఇక Redmi K20 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, దీని యొక్క బేస్ వేరియంట్ అయిన, 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్, 1999 యువాన్ (సుమారు రూ 20,000 రూపాయలు) ధరతో మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2099 యువాన్ (సుమారు రూ 21,000 రూపాయల) ధరకే అందించింది.
అయితే, ఇండియాలో విడుదల చేసేటప్పుడు, ఎటువంటి ధరలను నిర్ణయిస్తుందో. అలాగే స్పెక్స్ లో ఇంకా ఏమైనా మార్పులు చేస్తుంది అనే విషయం తెలియలంటే, జూలై 17 వరకు వేచిచూడాల్సిందే.