Redmi A7 Pro 5G: బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ధరలో మంచి ఫీచర్స్ తో రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో అందించింది

రెడ్ మీ ఈ బడ్జెట్ ఫోన్ ను 6300 భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది

Redmi A7 Pro 5G: బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Redmi A7 Pro 5G: షియోమీ ఉప బ్రాండ్ రెడ్ మీ ఈరోజు ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ధరలో మంచి ఫీచర్స్ తో రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi A7 Pro 5G: ప్రైస్

ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (4 జీబీ + 64 జీబీ) వేరియంట్ ను రూ. 11,499 ప్రైస్ తో మరియు (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 12,499 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ మిస్ట్ బ్లూ మరియు సన్ సెట్ ఆరెంజ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Redmi A7 Pro 5G: ఫీచర్స్

రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ స్టైల్ డిజైన్ మరియు రీగల్ కెమెరా డేకో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 ఆక్టా కోర్ 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు మినిమం గేమింగ్ కోసం సరిపోతుంది.

Redmi A7 Pro 5G

ఈ రెడ్ మీ ఫోన్ Hyper OS 3 మరియు ఆండ్రాయిడ్ 16 OS తో వచ్చింది. 4 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది. బ్యాటరీ పరంగా, రెడ్ మీ ఈ బడ్జెట్ ఫోన్ ను 6300 భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 15W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Also Read: BSNL Best Plan: 70 రోజులు హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!

ఈ ఫోన్ 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 300% వాల్యూమ్ అందించే బోటమ్ ఫైరింగ్ స్పీకర్, 3.5 జాక్ మరియు సింగల్ మైక్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ స్పెక్స్ షీట్ చూస్తుంటే, ఓవరాల్ గా ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా షియోమీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పొచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo