Redmi A7 Pro 5G launch date announced with big battery
Redmi A7 Pro 5G: రెడ్ మీ A సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏ 7 ప్రో 5జి లాంచ్ డేట్ ను షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది. రెడ్ మీ బడ్జెట్ సిరీస్ గా అందరికీ సుపరిచితమైన ఏ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కూడా బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ప్రైస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే, ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి అందించిన వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు అర్థం అవుతుంది.
రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 13వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ అవుతుంది. ఈ టీజర్ పీజీ నుంచి ఈ ఫోన్ ను కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్ అనే క్యాప్షన్ తో రెడ్ మీ టీజింగ్ చేస్తోంది.
Also Read: Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ 9020 mAh అతి భారీ బ్యాటరీ ఫోన్ లాంచ్ అవుతోంది.!
రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ సింపుల్ అవుతోంది. ఈ ఫోన్ లో సెగ్మెంట్ ఫస్ట్ మల్టీ టాస్కింగ్ ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ ఉన్నట్లు రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో స్మూత్ విజువల్స్ అందించే బిగ్ డిస్ప్లే ఉంటుందని కూడా రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ జెమినీ ఏఐ మరియు గూగుల్ యొక్క సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ షియోమీ కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ గురించి రెడ్ మీ ప్రత్యేకంగా చెబుతోంది. అదేమిటంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 6300mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. ఈ బిగ్ బ్యాటరీతో కూడా ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుందని టీజర్ లో వెల్లడించింది.