Redmi A7 Pro 5G: బిగ్ బ్యాటరీతో రెడ్ మీ కొత్త ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.!
Redmi A7 Pro 5G లాంచ్ డేట్ ను షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది
బడ్జెట్ సిరీస్ గా అందరికీ సుపరిచితమైన ఏ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది
ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది
Redmi A7 Pro 5G: రెడ్ మీ A సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏ 7 ప్రో 5జి లాంచ్ డేట్ ను షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది. రెడ్ మీ బడ్జెట్ సిరీస్ గా అందరికీ సుపరిచితమైన ఏ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కూడా బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ప్రైస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే, ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి అందించిన వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు అర్థం అవుతుంది.
SurveyRedmi A7 Pro 5G: లాంచ్ డేట్
రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 13వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ అవుతుంది. ఈ టీజర్ పీజీ నుంచి ఈ ఫోన్ ను కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్ అనే క్యాప్షన్ తో రెడ్ మీ టీజింగ్ చేస్తోంది.
Also Read: Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ 9020 mAh అతి భారీ బ్యాటరీ ఫోన్ లాంచ్ అవుతోంది.!
Redmi A7 Pro 5G: ఫీచర్స్
రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ సింపుల్ అవుతోంది. ఈ ఫోన్ లో సెగ్మెంట్ ఫస్ట్ మల్టీ టాస్కింగ్ ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ ఉన్నట్లు రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో స్మూత్ విజువల్స్ అందించే బిగ్ డిస్ప్లే ఉంటుందని కూడా రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ జెమినీ ఏఐ మరియు గూగుల్ యొక్క సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ షియోమీ కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ గురించి రెడ్ మీ ప్రత్యేకంగా చెబుతోంది. అదేమిటంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 6300mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. ఈ బిగ్ బ్యాటరీతో కూడా ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుందని టీజర్ లో వెల్లడించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile