Redmi A3 First Sale: షియోమి గత వారంలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ప్రీమియం హేలో డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో తీసుకు వచ్చింది షియోమి.
Survey
✅ Thank you for completing the survey!
Redmi A3 First Sale
రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 3 GB RAM + 64 GB ROM వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 4 GB RAM + 128 GB ROM వేరియంట్ కోసం రూ. 8,299 మరియు ఈ ఫోన్ యొక్క 6 GB RAM + 128 GB ROM హై ఎండ్ వేరియంట్ కోసం రూ. 9,299 రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.
రెడ్ మి ఎ3 స్మార్ట్ ఫోన్ కొత్త ప్రీమియం హేలో డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేని Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో Mediatek Helio G36 ప్రోసెసర్ మరియు 6GB RAM సపోర్ట్ వుంది. ఈ ఫోన్ ను 128 GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 1 TB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది.
Redmi A3 First Sale and Features
రెడ్ మి ఎ3 లో వెనుక 8MP డ్యూయల్ రియర్ కేమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను ఎక్కువ కాలం నడిపించ గల 5000 mAh బిగ్ బ్యాటరీ ను కూడా ఈ ఫోన్ లో అందించింది రెడ్ మి.