10 వేలకే రెడ్ మీ 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్.!

10 వేలకే రెడ్ మీ 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

10 వేలకే రెడ్ మీ 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

ర్యామ్ బూస్టర్ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మర్కెట్లో లాంచ్ చెయ్యబడింది

MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది

10 వేలకే రెడ్ మీ 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Redmi 10A Sport స్మార్ట్ ఫోన్ మరియు బడ్జెట్ ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ 6GB ర్యామ్ తో 10 వేల బడ్జెట్ కేటగిరిలో విడుదల చేసింది. రెడ్ మి 10ఎ స్పోర్ట్ పెద్ద డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు ర్యామ్ బూస్టర్ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మర్కెట్లో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ వివరాలు చూద్దామా.  

Redmi 10A Sport : ధర

షియోమి రెడ్‌మి 10ఎ స్పోర్ట్  సింగిల్ వేరియంట్ 6 జిబి + 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర ధర రూ .10,999. ఈరోజు నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అంధుబాటులో వుంది.

Redmi 10A Sport : స్పెక్స్

షియోమి రెడ్‌మి 10ఎ స్పోర్ట్ పెద్ద 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. Redmi 10A Sport యొక్క స్క్రీన్‌ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 194 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10A చార్కోల్ బ్లాక్, సీ బ్లూ మరియు స్లేట్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

Redmi 10A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ కి జతగా 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది. అదనంగా, RAM బూస్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.

రెడ్‌మి 10ఎ స్పోర్ట్ లో వెనుక క్వాడ్ కెమెరా అనిపించేలా సెటప్ వున్నా కూడా 13 ఎంపి కెమెరా సింగల్ కెమెరాని మాత్రమే అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh  బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo