Redmi 17 5G: బిగ్ బ్యాటరీ అండ్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
రీసెంట్ గా రెడ్ మీ నోట్ 17 మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన షియోమీ
ఇప్పుడు Redmi 17 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కూడా అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను బిగ్ బ్యాటరీ అండ్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేసింది
Redmi 17 5G: రీసెంట్ గా రెడ్ మీ నోట్ 17 మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన షియోమీ, ఇప్పుడు రెడ్ మీ 17 స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బిగ్ బ్యాటరీ అండ్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, కీలక ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ ఏమిటో లుక్కేద్దామా.
SurveyRedmi 17 5G: లాంచ్ డేట్
రెడ్ మీ 17 స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కూడా అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.
Redmi 17 5G: కీలక ఫీచర్స్
రెడ్ మీ 17 5జి స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ బ్యాక్ డిజైన్ తో మెరుస్తూ కనిపిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ ను మూడు అందమైన రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు కూడా షియోమీ అనౌన్స్ చేసింది. ఎటర్నల్ ఆరెంజ్, అబ్జల్యూట్ బ్లాక్ మరియు ఎండ్ లెస్ బ్లూ మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది. వీటిలో ఆరంజ్ కలర్ వేరియంట్ మాత్రమే లెథర్ బ్యాక్ డిజైన్ లో కనిపిస్తోంది.

ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ 7900 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఇందులో బిగ్ బ్యాటరీ మాత్రమే కాదు ఆకట్టుకునే ఛార్జ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అవేమిటంటే, ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ను కూడా రెడ్ మీ నోట్ 17 మాదిరిగా పెద్ద 6.9 ఇంచ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను నడిపించే ప్రాసెసర్ వివరాలు కూడా రెడ్ మీ వెల్లడించింది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 5 ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది. ఇది 4nm TSMC చిప్ సెట్ మరియు రోజువారీ పనులకు తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 300% వాల్యూమ్ సౌండ్ అందించే స్పీకర్ కూడా ఉంటుంది.
Also Read: VIRAT V1 Pro 5G Sale: భారీ ఆఫర్స్ తో వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.!
అంచనా ప్రైస్
షియోమీ ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ ను రూ. 18,000 నుంచి రూ. 20,000 ధరలో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
