Redmi 10A Sport: 6GB ర్యామ్ తో 10 వేల బడ్జెట్ లో వచ్చింది.!
Redmi 10A Sport ఇండియా లాంచ్ చెయ్యబడింది
6GB ర్యామ్ తో 10 వేల కేటగిరిలో వచ్చింది
బిగ్ బ్యాటరీ మరియు ర్యామ్ బూస్టర్ ఫీచర్లతో లాంచ్
Redmi 10A Sport ఇండియా లాంచ్ చెయ్యబడింది. షియోమీ బడ్జెట్ సిరీస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ తో 10 వేల బడ్జెట్ కేటగిరిలో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. రెడ్ మి 10ఎ స్పోర్ట్ పెద్ద డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు ర్యామ్ బూస్టర్ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మర్కెట్లో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ వివరాలు చూద్దామా.
SurveyRedmi 10A Sport : ధర
షియోమి రెడ్‌మి 10ఎ స్పోర్ట్ సైగలే వేరియంట్ 6 జిబి + 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర ధర రూ .10,999. ఈరోజు నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అంధుబాటులో వుంది.
Redmi 10A Sport : స్పెక్స్
షియోమి రెడ్‌మి 10ఎ స్పోర్ట్ పెద్ద 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. Redmi 10A Sport యొక్క స్క్రీన్ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 194 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10A చార్కోల్ బ్లాక్, సీ బ్లూ మరియు స్లేట్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
Redmi 10A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ కి జతగా 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది. అదనంగా, RAM బూస్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.
రెడ్‌మి 10ఎ స్పోర్ట్ లో వెనుక క్వాడ్ కెమెరా అనిపించేలా సెటప్ వున్నా కూడా 13 ఎంపి కెమెరా సింగల్ కెమెరాని మాత్రమే అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile