రియల్మీ 5 vs వివో U10 : ఏది మీకు బెస్ట్ అప్షన్ అవుతుంది

రియల్మీ 5 vs వివో U10 : ఏది మీకు బెస్ట్ అప్షన్ అవుతుంది
HIGHLIGHTS

ఈ బడ్జెట్‌లో మీకు ఏ స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంటుందో కూడా తెలుసుకోనున్నాం.

వివో సంస్థ ఒక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కేవలం బడ్జెట్ ధరలోనే తన U 10 ఫోన్ను భారతీయ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది.  మీరు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ని  కేవలం రూ .10000 కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. అయితే, మార్కెట్లో ఇలాంటి మొబైల్ ఫోన్లు చాలా ఉన్నాయి, ముఖ్యంగా దాదాపు ఒకే రకమైన స్పెక్స్‌తో ఒకే ధరతో కొనేవీలుండే స్మార్ట్ ఫోన్లు కూడా వున్నాయి. అందుకోసమే, ఇప్పుడు వివో U 10 స్మార్ట్ ఫోన్ను  దాదాపుగా అటువంటి స్పెక్స్ మరియు ధరతో వచ్చే రియల్మీ 5 స్మార్ట్‌ ఫోన్లతో పోల్చబోతున్నాం మరియు ఈ బడ్జెట్‌లో మీకు ఏ స్మార్ట్ ఫోన్  మంచిగా ఉంటుందో కూడా తెలుసుకోనున్నాం.

ధర (Price)

వివో U10 ధర రూ .8,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట కోసం ఇచ్చినది. ఇవి కాకుండా 3 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ .9,990 , 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ .10,990 గా ఉంది.  లాంచ్ ఆఫర్ కింద, ఈ ఫోన్ను SBI కార్డుతో కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది మరియు 6 నెలల వరకు ఖర్చు లేకుండా NO Cost EMI తో కొనుగోలు చేయవచ్చు.

ఇక రియల్మీ5 స్మార్ట్ ఫోన్ గురించి చూస్తే, దాని 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .9,999 వద్ద ప్రారంభించబడింది. ఈ ఫోన్ యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .10,999 కు, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .11,999 కు ప్రవేశపెట్టారు.

ప్రత్యేకతలు ( Specs)

 రియల్మి 5 యొక్క స్పెక్స్ గురించి చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్  ఒక 6.5-అంగుళాల మినీ-డ్రాప్ పూర్తి స్క్రీన్ డిస్ప్లేని కలిగి ఉంది, ఇది 89% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది . ఈ స్మార్ట్‌ ఫోనుకు క్రిస్టల్ డిజైన్ ఇవ్వబడింది మరియు ఇది క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13MP ప్రాధమిక కెమెరా ఇవ్వబడింది మరియు రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్స్ మరియు మూడవ 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

రియల్మి 5 ప్రో మాదిరిగానే క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఇందులో ఉంది. ఇది 240fps స్లో-మో వీడియో, 190 డిగ్రీల వ్యూ ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 తో ఫోన్ లాంచ్ చేయబడింది మరియు డివైస్ ట్రిపుల్ సిమ్ స్లాట్‌ తో వస్తుంది.

అయితే,  వివో యు 10 మొబైల్ ఫోన్ విషయానికి వస్తే, వివో యు 10 ఒక 6.35 అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. ఈ డివైస్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు రంగులలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి కాకుండా, 5000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోన్‌లో డార్క్ మోడ్‌ను కూడా అందించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo