64MP కెమేరా ఫోన్ Realme XT రెండర్ విడుదల: ఈవిధంగా ఉండనుంది ఫోన్
ఈ ఫోన్ యొక్క డిస్ప్లే లోపల ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వబడుతుంది
ఇండియాలో, ఇటీవల రియల్మీ తన కొత్త రియల్మీ 5 సిరిస్ నుండి క్వాడ్ కెమేరాలతో రియల్మీ 5, రియల్మీ 5 ప్రో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ రెండు సరికొత్త ఫోన్‌లను విడుదల చేసేటప్పుడు, సెప్టెంబర్ చివరి నాటికి 64 MP కెమెరాలతో రియల్మీ XT పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది.
Surveyఇప్పుడు, రియల్మీ కి చెందిన సిఎంఓ జు క్వి చేజ్, ఫోన్ యొక్క మొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్మీ 5 సిరీస్‌తో సమానంగా కనిపిస్తుంది మరియు ఫోన్‌లో నాలుగు కెమెరా సెన్సార్లు నిలువుగా సమలేఖనం చేయబడ్డాయి మరియు ఫోన్ స్నో వైట్ కలర్‌లో కనిపించింది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేనట్లుగా, ఈ టీజర్ చూపిస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ యొక్క డిస్ప్లే లోపల ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వబడుతుంది మరియు ఫోన్‌లోని డిస్ప్లే కూడా OLED ప్యానెల్ అవనునట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ, రియల్మీ యొక్క ఫోన్లలో ఈ రియల్మీ XT నుండి ప్రారంభించనుంది కావచ్చు.
ఇక ప్రధానాంశమైన, 64 MP కెమెరా గురించి మాట్లాడితే, న్యూ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కెమెరా ఎక్స్‌పీరియన్స్ జరిగింది. ఈ పరికరంలో శామ్‌సంగ్ యొక్క సరికొత్త ఐసోసెల్ బ్రైట్ జిడబ్ల్యు 1 సెన్సార్ ఉంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో లెన్స్ మరియు డెప్త్ సెన్సార్‌తో వస్తుంది.
అయితే, 64 MP స్మార్ట్ ఫోన్ కోసం పనిచేస్తున్న ఏకైక బ్రాండ్ రియల్మీ మాత్రమే కాదు, ఆగస్టు 29 న రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ను ఒక 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌తో లాంచ్ చేయనుంది.